ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత వరుసగా అరెస్టులు జరుగుతున్న సంగతి తెలిసిందే. వైసిపికి మద్దతుగా మాట్లాడిన వారిని అలాగే వైసిపి ఫైర్ బ్రాండ్ నేతలను వరుస పెట్టి కూటమి ప్రభుత్వం అరెస్టు చేస్తున్న. పాత కేసులు తెరపైకి తీసుకువచ్చి కేసులు బుక్ చేస్తోంది. ఈ తరుణంలోనే  ఇప్పటికే చాలా మంది వైసిపి నేతలు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇక వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు బోరు గడ్డ అనిల్ రెచ్చిపోయి మాట్లాడేవారు.

బోరుగడ్డ అనిల్.. గత నాలుగు నెలల కింద అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అరెస్ట్ అయిన బోరుగడ్డ అనిల్ కు పోలీస్ స్టేషన్లో కూడా... సకల మర్యాదలు చేశారు పోలీసులు. ఇక ఇటీవల బెయిల్ పై రిలీజ్ అయ్యాడు అనిల్.  తన తల్లి ఆరోగ్యం సరిగా లేదని.. డాక్టర్ తో ఒక సర్టిఫికెట్ కూడా తెచ్చుకున్నాడు. ఆ సర్టిఫికెట్ ద్వారా హైకోర్టులో మధ్యంతర బెయిల్ కోసం అప్లై చేసుకున్నాడు.  ఇక తల్లి ఆరోగ్యం అనగానే హైకోర్టు కూడా మధ్యంతర బెయిల్ ఇవ్వడం.. జరిగింది.

 దీంతో ఇటీవల... జైలు నుంచి బోరుగడ్డ అనిల్ రిలీజ్ అయ్యారు. చెన్నైలో ఉన్న తన తల్లిని చూసేందుకు అక్కడికి వెళ్లారు. అయితే... చెన్నై వెళ్లిన తర్వాత బోరుగడ్డ అనిల్ ఆచూకీ ఎక్కడ కనిపించడం లేదని అనంతపురం పోలీసులు చెబుతున్నారు. అక్కడి నుంచి కోల్కత్త కు పారిపోయినట్లు కొంతమంది ప్రచారం చేస్తున్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత అసలు చెన్నైకి రాలేదని కూడా కొంతమంది... ధ్రువీకరిస్తున్నారు.

 జైలు నుంచి బయటికి రావడానికి తన తల్లి అనారోగ్యంగా ఉందని ఫేక్ సర్టిఫికెట్ తీసుకువచ్చాడని పోలీసులు తాజాగా గుర్తించారట. దీంతో... ఫేక్ సర్టిఫికెట్ సృష్టించినందుకు మరో కేసు బుక్ చేసి అతని కోసం అనంతపురం పోలీసులు చెన్నైకి వెళ్లారు. చెన్నైలో ప్రస్తుతం గాలిస్తున్నారు పోలీసులు. అక్కడ అనిల్ ఆచూకీ దొరకనట్టు తెలుస్తోంది. కోల్కత్తా వెళ్లాడా ? బెంగళూరులో ఉన్నాడా? హైదరాబాద్ లో దాక్కున్నాడా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: