ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి సర్కార్ ఈ అధికారాన్ని సొంతం చేసుకోవడానికి కారణమైన పథకాలలో ఫ్రీ బస్ స్కీమ్ కూడా ఒకటి అనే సంగతి తెలిసిందే. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఈ స్కీమ్ ఎప్పుడు అమలవుతుందా అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది ఉగాది నుంచి ఫ్రీ బస్ స్కీమ్ అమలయ్యే అవకాశాలు ఉన్నాయి.
 
అయితే ఫ్రీ బస్ స్కీమ్ జిల్లా వరకు మాత్రమే పరిమితం అంటూ క్లారిటీ రావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనీసం ఉమ్మడి జిల్లాల వరకైనా ఈ స్కీమ్ ను అమలు చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం 26 జిల్లాలు ఉన్నాయి. చాలామంది మహిళలు ఫ్రీ బస్ స్కీమ్ వల్ల దూర ప్రాంతాలకు వెళ్లడానికి అణువుగా ఉంటుందని భావిస్తారనే సంగతి తెలిసిందే.
 
ఇలాంటి మహిళలు తాజాగా వచ్చిన క్లారిటీతో నిరాశకు గురవుతున్నారు. ఈ స్కీమ్ వల్ల ప్రభుత్వానికి పెద్దగా భారం పడదని అదే సమయంలో ప్రజలకు సైతం ఒరిగేది ఉండదని కామెంట్లు వ్యక్తమతువున్నాయి. ఈ స్కీమ్ అమలు నిబంధనలు ఏ మాత్రం ఆమోద యోగ్యంగా లేవని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ఫ్రీ బస్ స్కీమ్ గురించి వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.
 
ఇతర రాష్ట్రాలు ఫ్రీ బస్ స్కీమ్ ను అమలు చేస్తున్న తీరుకు ఏపీలో అమలు అయ్యే తీరుకు ఏ మాత్రం సంబంధం లేదని కచ్చితంగా చెప్పవచ్చు. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ స్కీమ్ ను వీలైనంత బెస్ట్ గా అమలు చేస్తుంటే ఏపీ సర్కార్ మాత్రం ఇందుకు సంబంధించి విమర్శల పాలు అవుతుండటం గమనార్హం. ఫ్రీ బస్ స్కీమ్ విషయంలో ఏపీ సర్కార్ తీరు మారాల్సి ఉందని చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: