
కాంగ్రెస్ అంటేనే రెడ్డి రాజ్యమంటూ... తీన్మార్ మల్లన్న రెచ్చిపోయాడు. కానీ దాదాపు ఏడాది కాలముగా... అతన్ని.. వాటి నుంచి తొలగించలేదు. కానీ ఏఐసీసీ కొత్త ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ రాగానే.... తీన్మార్ మల్లన్న పై వేటు పడింది. అంతేకాదు... వి హనుమంతరావు ఇంట్లో కాపు సామాజిక వర్గ నేతలు సమావేశంలో జరిగినాయి. దీనిపై కూడా మీనాక్షి నటరాజన్ సీరియస్ అయ్యారు. క్రమశిక్షణ దాటితే వేటు తప్పదని వార్నింగ్ ఇచ్చారు మీనాక్షి నటరాజన్.
అసలు సిసిల్ కాంగ్రెస్ నేతలకు న్యాయం చేసేలా మీనాక్షి నటరాజన్ ముందుకు సాగుతున్నారు. ఈ తరుణంలోనే పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్తగారు ఝాన్సీ రెడ్డి పై.. పాలకుర్తి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా.. పాలకుర్తిలో అత్తా కోడళ్ళ.. ఆగడాలు భరించలేకపోతున్నామని కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేశారు లోకల్ లీడర్లు.
అసలు సిసలు కాంగ్రెస్ నాయకులకు అన్యాయం చేస్తూ... కొత్తగా పార్టీలోకి.. వచ్చిన వారికి... న్యాయం చేస్తున్నారని... యశస్విని రెడ్డి అలాగే ఆమె అత్త ఝాన్సీ రెడ్డి పై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ కు పాలకుర్తి కాంగ్రెస్ కార్యకర్తలు లేఖ కూడా రాయడం జరిగింది. పాలకుర్తి నాయకులపై చర్యలు తీసుకోవాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. అసలైన కాంగ్రెస్ నాయకులకు న్యాయం చేసేలా మీనాక్షి నటరాజన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై మీనాక్షి నటరాజన్ ఎలా స్పందిస్తారో చూడాలి.