గుడివాడ మాజీ వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానికి బిగ్‌ షాక్‌ తగిలింది. రంగంలోకి గుడివాడ పోలీసులు దిగారు. తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని అత్యంత సహితులకు 41ఎ నోటీసులు జారీ చేశారు గుడివాడ పోలీసులు. వాలంటీర్లను బలవంతంగా రాజీనామా చేయించడం, లిక్కర్ గౌడౌన్ వ్యవహారంలో బెదిరింపుల కేసులలో మాజీ మంత్రి కొడాలి నాని అత్యంత సహితులకు 41ఎ నోటీసులు జారీ చేశారు గుడివాడ పోలీసులు. దీంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాలు వేడెక్కాయి.

కొడాలి నాని షాడోగా పేరుపొందిన దుక్కిపాటి శశిభూషన్, సన్నిహిత మిత్రుడు పాలడుగు రాంప్రసాద్, గుడివాడ వైకాపా అధ్యక్షుడు గొర్ల శ్రీనులకు...41ఎ నోటీసులు జారీ చేశారు గుడివాడ పోలీసులు. ఈ రెండు కేసులలో మాజీ మంత్రి కొడాలి నానికి కూడా కొత్త చిక్కులు ఎదురుకానున్నాయి.  మాజీ మంత్రి కొడాలి నాని, అప్పటి ఏపీ బెవరేజేస్ ఎండీ వాసుదేవరెడ్డి ,జె.సి మాధవీలతరెడ్డి తదితరులపై వివిధ సెక్షన్ల కింద  కేసులు నమోదు  చేశారు గుడివాడ  పోలీసులు.

ఈ కేసులలో కోర్టుకు వెళ్లడంతో 41ఏ నోటీసులిచ్చి విచారణ చేయాలని ఆదేశించిడం జరిగింది ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర హై కోర్టు. దీంతో  వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో 41 ఏ నోటీసులు అందుకున్నారు కొడాలి నాని సన్నిహితులు. అయితే.. ఇదే కేసులో మాజీ మంత్రి కొడాలి నానిని ఇరికించి.. అరెస్ట్‌ చేయాలని టీడీపీ కూటమి సర్కార్‌ కుట్రలు చేస్తున్నట్లు చెబుతున్నారు.


రూట్‌ క్లియర్‌ అయితే.... మాజీ మంత్రి కొడాలి నానిని కూడా అరెస్ట్‌ చేసే ఛాన్సు ఉందట. ఇప్పటికే మాజీ మంత్రి కొడాలి నాని సామాజిక వర్గానికి చెందిన వల్లభ నేని వంశీని అరెస్ట్‌ చేశారు ఏపీ పోలీసులు. అటు పోసాని కృష్ణ మురళిని అరెస్ట్‌ చేశారు. ఈ తరుణంలోనే... మాజీ మంత్రి కొడాలి నానినే ఇప్పుడు టీడీపీ టార్గెట్‌ అని ప్రచారం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: