- ( రాయ‌ల‌సీమ - ఇండియా హెరాల్డ్ ) . . .

కూటమిలో ఎమ్మెల్సీల కోసం నోటిఫికేష‌న్ వ‌చ్చిన నేప‌థ్యం లో టిడిపి నుంచి ఎవరికి ? అవకాశం ఇస్తారు అనేదానిపై చర్చనీయాంశంగా మారింది. సామాజిక సమీక‌ర‌ణ‌ల తో కొంత పాటు పార్టీ కోసం పనిచేసిన సీనియర్లు తమకు అవకాశాలు వస్తాయని ఆశలతో ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో చాలామంది నాయకులు పదవులు ఆశిస్తున్నారు. ఎవరి ప్రయత్నాలు వారి ముమ్మరంగా చేస్తున్నారు. రకరకాలుగా పార్టీ పెద్దల ఆశీస్సులు కోసం కుస్తీ పడుతున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు కిలక నేతలు మంత్రి నారా లోకేష్ ను కలిసి తమ పేర్లను ఎమ్మెల్సీ సీట్ల కోసం పరిశీలన చేయాలని విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ... మాజీ ఎంపీల సైఫుల్లా తనయుడు కేఎం జకీవుల్ల ఇద్దరు పేర్లు ఎమ్మెల్సీ రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ప్రభాకర్ చౌదరి మొన్న ఎన్నికలలో తన సీటు త్యాగం చేశారు. దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ కోసం తన సీటు వదులుకున్నారు.


ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు పార్టీ అధికారంలోకి వచ్చాక సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ప్రభాకర చౌదరి పార్టీ గెలుపు కోసం పనిచేశారు. అలాగే ఉమ్మడి కర్నూలు జిల్లా ఇన్చార్జిగా ప్రభాకర్ చౌదరి సక్సెస్ అయ్యారు. కర్నూలు జిల్లాలో పలు నియోజకవర్గాలలో పార్టీ నాయకుల మ‌ధ్య‌ సమన్వయం లేకపోగా వారందరినీ ఎన్నికల సమయంలో ఏకతాటి మీదకు తీసుకువచ్చారు. ఇక మాజీ ఎంపీ సైపుల్లా తనయుడు సీనియర్ నాయకుడు జఖీవుల్లా  పార్టీ కోసం వీర విధేయుడుగా పనిచేస్తున్నారు. పార్టీ అధికారంలో లేనప్పుడు కర్నూలు జిల్లాలో మూడు నియోజకవర్గాల పరిశీలకుడిగా పార్టీ బాధ్యతలను చూశారు .ఎన్నికలకు ముందు డోన్ నియోజకవర్గ పరిశీలకుడిగా పని చేశారు. మైనార్టీ వర్గాల్లో ఆయనకు మంచి పేరు ఉంది. ఈ క్రమంలో మైనార్టీ కోటాలో ఆయన కూడా తనకు ఎమ్మెల్సీ ఇవ్వాలని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: