
కామవరపుకోట: తెలుగుదేశం పార్టీతోనే నిజమైన మహిళా సాధికార సాధ్యమవుతుందని చింతలపూడి మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ రామకృష్ణ పేర్కొన్నారు. శనివారం మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పాతూరులోని మురళీ స్వగృహంలో మండల పార్టీ అధ్యక్షులు కిలారు సత్యానారాయణ అధ్యక్షతన మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు, ట్రైలర్లు, కూరగాయలు అమ్మేవారు, ప్రకృతి వ్యవసాయంలో రాణిస్తోన్న వారు, వైద్య సిబ్బందిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలను దుస్సాలువాల తో ఘనంగా సన్మానించడం తో పాటు వారు తమ వృత్తులలో ఎలా రాణిస్తున్నారో కొనియాడారు. మురళీ మాట్లాడుతూ తాజాగా కూటమి ప్రభుత్వం చేతి వృత్తులు చేసుకునే మహిళలకు రు. 4 వేల కోట్ల రుణాలు కేటాయించడం ఈ ప్రభుత్వానికి మహిళాభ్యుదయం పట్ల ఉన్నతికి నిదర్శనం అన్నారు.
కామవరపుకోట మండల పార్టీ అధ్యక్షులు కిలారు సత్యనారాయణ మాట్లాడుతూ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో పాటు స్థానిక శాసనసభ్యులు సొంగా రోషన్‌కుమార్ సూచనలతో వివిధ రంగాలు , వృత్తుల్లో రాణిస్తోన్న మహిళలను మండల పార్టీ ఆధ్వర్యంలో సన్మానించడం గర్వంగా ఉందన్నారు. మహిళా సాధికారితకు పెట్టింది పేరు తెలుగుదేశం పార్టీ అని .. ఆ పార్టీ రూపకల్పన చేసిన డ్వాక్రా సంఘాలు ఈ రోజు రాష్ట్రం అంతటా లక్షల్లో విస్తరించి.. వాటితో మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించారని ప్రశసించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ రామకృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు కిలారు సత్యనారాయణ, పట్టణ పార్టీ ప్రెసిడెంట్ వజీర్‌ఖాన్, బూత్ కమిటీ అధ్యక్షులు గంటా గోపీ, తెలుగు యువత పాకలపాటి రవి, సాయిన శ్రీకాంత్, కరిపోతు కృష్ణ, బొల్లుబోయిన కళ్యాణం, వానపల్లి పండు, అడపా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.