- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )  . . .

ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు కు పార్టీ యువ‌నేత .. మంత్రి నారా లోకేష్ ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. రామానాయుడు కేవలం పనిపైనే కాకుండా కాస్త ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలని ఇరిగేషన్ మంత్రి లోకేష్ సలహా ఇచ్చారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరా ల సమయంలో మంత్రి నిమ్మల జ్వరంతో బాధపడుతున్న విషయాన్ని లోకేష్ ప్రస్తావిస్తూ ... రామానాయుడు విశ్రాంతి తీసుకునేలా రూలింగ్ ఇవ్వాలని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజును కోరడంతో శాసనసభలో నవ్వుల పువ్వులు విరిశాయి. లోకేష్ వ‌స్తుండ‌గా రామానాయుడు చేతికి సెలైన్ స్టిక్క‌ర్ ఉండ‌డాన్ని లోకేష్ గ‌మ‌నించారు. వెంట‌నే ఏం జ‌రిగింద‌ని అడ‌గ గా రామానాయుడు తాను ఫీవ‌ర్ తో బాధ‌ప‌డుతున్న విష‌యాన్ని చెప్పారు.


వెంట‌నే లోకేష్ కాస్త విశ్రాంతి తీసుకోవాల‌ని .. హెల్త్ ఇంపార్టెంట్ క‌దా అని సూచించారు. విశ్రాంతి తీసుకుంటారా లేక సభ నుంచి సస్పెండ్ చేయించమంటారా అంటూ లోకేష్ చమత్కరించారు. అసెంబ్లీ లాబీల్లో మంత్రి రామా నాయుడు ఎదురుపడినపుడు ఆయన ఆరోగ్యంపై లోకేష్ వాకబు చేస్తూ... ఒక చేతికి సెలైన్ ఇంజెక్షన్ పెట్టుకుని నేడు మరో చేతిలో కాగితాలు పట్టుకుని తిరుగుతూనే ఉంటే ఆరోగ్యం ఏం కావాలని ఆప్యాయంగా ప్రశ్నించారు. నిన్నటి మీద ఈరోజు ఆరోగ్యం బాగానే ఉంది, అందుకే వచ్చానన్న రామానాయుడు సమాధానమిచ్చారు. మాట వినకుంటే నా యాపిల్ వాచ్ ని మీ చేతికి పెట్టి నిద్రను మానిటర్ చేస్తానని లోకేష్ చెప్పడంతో ఈ రోజు సభ అయ్యాక మీ మాట ప్రకారమే విశ్రాంతి తీసుకుంటానని రామానాయుడు అన్నారు. ఇక ఈ విష‌యం సోష‌ల్ మీడియా లో హైలెట్ అవ్వ‌డం తో ప‌లువురు టీడీపీ నాయ‌కులు ... నియోజ‌క‌వ‌ర్గ పార్టీ శ్రేణులు రామానాయుడుకు ఫోన్ చేసి ఆరోగ్యం గురించి వాక‌బు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: