
ఇక ఇప్పటి వరకు వివేక హత్య కేసు లో అత్యంత కీలకమైన సాక్షులు ఇప్పటికే ఆరుగురు చనిపోయారు .. వైసిపి హయాం లో నలుగురు చనిపోగా .. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఇద్దరు మరణించారు .. అందరూ అనారోగ్య కారణాల తోనే అనుమానాస్పదం గా చనిపోతున్నారు .. అయితే ఇప్పుడు చనిపోయిన వారి లో చాలా మందికి సరైన ఆరోగ్య సమస్యలు కూడా లేవు .. ఊహించిని విధంగా అనారోగ్యం పాలై అప్పుడు అకప్పుడు చనిపోతున్నారు .. ఈ సమయం లోనే వీటిని అనుమానస్పద చావులు గా భావించి .. వాటి వెనక గుట్టు ఏమిటో బయట పెట్టాలనుకుంటున్నారు ..
అలాగే సాక్షుల మరణాల విషయం లో ఏం జరుగుతుందో ఆరా తీస్తే .. వివేక హత్య కేసు లోని కీలక విషయాలు కూడా వెలుగులోకి వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తుంది .. ఇప్పటికే దర్యాప్తు చేస్తున్న సిబిఐ అధికారులపై తప్పుడు కేసులు కూడా పెట్టారని వారిని అడ్డుకుంటున్నారని బెదిరించారని వార్తలు కూడా వచ్చేయి .. గతంలో కడపలో పనిచేసిన పోలీసులు ఇతర అధికారులను కూడా విచారించి .. వెనుక ఉన్న రహస్యాలు ఏమిటో సీట్ బయట పెట్టనుంది. ఇక మరి ఈ సీట్ దర్యాప్తులో ఎలాంటి సంచనాలు బయటికి వస్తాయో చూడాలి .