ఏపీ సీఎం చంద్రబాబు తప్పుల మీద తప్పులు చేస్తున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. గనుల విషయంలో సర్కారు వారు ఘోరమైన తప్పు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఏపీ సర్కార్ గనుల ద్వారా వచ్చే ఆదాయాన్ని గాలికి వదిలేస్తున్నారట. ఇదే విషయాన్ని ఎప్పటి నుంచో గొంతు చించుకుని కొందరు సర్కార్‌కి మొరపెట్టుకుంటున్నా, మద్యం, ఇసుక సంగతి ఎవరు పట్టించుకోవడంలేదని తెలుస్తోంది.

అసలు రాష్ట్రం అప్పుల్లో ఎందుకు కూరుకుపోతుందో తెలుసా? ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ము కాస్తా కార్యకర్తల జేబుల్లోకి, నాయకుల ఖాతాల్లోకి, వ్యాపారస్తుల ఖజానాల్లోకి మళ్లిపోతోంది. సో, ప్రభుత్వం మాత్రం ఎలా డబ్బు సంపాదిస్తుంది చెప్పండి ఇదే విషయాన్ని ఆంధ్రజ్యోతి పత్రిక కూడా నిప్పులు చెరిగేలా రాసింది.

ఆంధ్రజ్యోతి పత్రిక కూడా ఇదే తంతుని "సొంత ఆదాయానికి సర్కార్ గండి" అంటూ పెద్ద హెడ్డింగ్‌తో బయటపెట్టింది. ప్రభుత్వమే స్వయంగా గనుల ఆదాయానికి గండి కొట్టుకుంటే ఇంకేం మిగులుతుంది. ఖజానా నింపాల్సిన సీనరేజ్ కలెక్షన్ కాంట్రాక్టులను ఏకంగా నాలుగున్నర నెలలు మూసేశారు. ఇది చాలదన్నట్టు, కాంట్రాక్టులు లేని జిల్లాల్లో కూడా మైనింగ్ పర్మిట్లన్నీ బంద్. ఫలితం ఏంటంటే, ప్రభుత్వానికి 800 కోట్లు నష్టం. అక్షరాలా 800 కోట్లు గంగలో కలిపేశారు.

గనుల శాఖ వాళ్లు మాత్రం ఈ నష్టాన్ని కాంట్రాక్టు కంపెనీలు కట్టాల్సిన బకాయిలు అంటున్నారు. అంటే దొంగే దొంగ అన్నట్టు ఉంది వ్యవహారం. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, చంద్రబాబు నాయుడిని కూడా బురిడీ కొట్టించారని అంటున్నారు. గత ప్రభుత్వం 2023లో ఏం చేసిందంటే, ఉమ్మడి జిల్లాల లెక్కన గనుల కాంట్రాక్టులు ఇచ్చింది. అంతకుముందు గనుల శాఖే డబ్బులు వసూలు చేసేది కానీ లీకేజీలు ఎక్కువయ్యాయి. అందుకే నిపుణులు ప్రైవేటు కంపెనీలకు ఇస్తే బెటర్ అని సలహా ఇచ్చారు.

మొదట్లో ఏడు జిల్లాలకు కాంట్రాక్టులు ఇచ్చారు. శ్రీకాకుళం, చిత్తూరు, అనంతపురం, గుంటూరు, విజయనగరం, కడప, తూర్పు గోదావరి జిల్లాలకు ప్రైవేటు ఏజెన్సీలు వచ్చాయి. వాళ్లు సీనరేజ్ వసూలు చేసి నెలనెలా ప్రభుత్వానికి డబ్బులు కడుతున్నారు. ఇంకా విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, కృష్ణ, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో మాత్రం పాత పద్ధతే. గనుల శాఖే వసూలు చేస్తోంది. ఇలా కాంట్రాక్టులు, గనుల శాఖా కలిపి ఏటా 2000 కోట్లు ఆదాయం రావాలి.

కానీ కొత్త ప్రభుత్వం రాగానే జూన్‌లోనే ఈ కాంట్రాక్టుల గోల మొదలుపెట్టారు. కాంట్రాక్టులు రద్దు చేశారు. బహుశా కొత్త వాళ్లకి కట్టబెట్టాలని చూశారేమో. కానీ కొత్తగా ఎవరికీ ఇవ్వలేదు. నాలుగున్నర నెలలు ఊరుకున్నారు. గనుల శాఖ చేతుల్లో ఉన్న జిల్లాల్లో పర్మిట్లు కూడా ఆపేశారు. దీంతో సర్కారుకి 1300 కోట్లు నష్టం అని అధికారులు గుసగుసలాడుతున్నారు. 1300 కోట్లు అంటే మామూలు విషయం కాదు.

ఇంత జరిగాక, పోయిన ఏడాది నవంబర్ నుంచి మళ్లీ కాంట్రాక్టులు మొదలుపెట్టారు. విచిత్రం ఏంటంటే, పాత కంపెనీలనే కంటిన్యూ చేశారు. మరి ఎందుకు ఆపినట్టు, మళ్లీ వాళ్లనే ఎందుకు పెట్టుకున్నట్టు, ఈ నాలుగు నెలలు ఏం సాధించారు? అసలు ఏం జరిగిందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇప్పుడు ఆగిన నాలుగు నెలలకి 800 కోట్లు బకాయిలు కట్టమని కంపెనీలను బెదిరిస్తుండటంతో వాళ్లు లబోదిబోమంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: