ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో... తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు మెగా బ్రదర్ నాగబాబు. ఎన్నో రోజులుగా మెగా బ్రదర్ నాగబాబు కు పదవి వస్తుందని అందరూ అనుకున్నారు. అది అందని ద్రాక్ష గానే మిగిలింది.. అయితే తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో... మెగా బ్రదర్ నాగబాబు కు ఛాన్స్ ఇచ్చింది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. దీంతో ఆయన తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది.

అయితే కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన నాగబాబు అఫిడవిట్ లో షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దగ్గర మెగా బ్రదర్ నాగబాబు అప్పు తీసుకున్నట్లు తన నామినేషన్ సమయంలో అఫిడవిట్ లో పొందుపరిచాడు. ఈ సందర్భంగా తన అప్పులతో పాటు ఆస్తుల వివరాలను కూడా క్లుప్తంగా వివరించాడు నాగబాబు. ఇక మెగా బ్రదర్ నాగబాబు అఫిడవిట్ లెక్కల ప్రకారం మ్యూచువల్ ఫండ్స్ అలాగే బాండ్స్ మొత్తం 55.37 కోట్లు ఉంది. బ్యాంకులో సేవింగ్స్ 23.53 లక్షలు ఉన్నట్లు పేర్కొన్నాడు మెగా బ్రదర్ నాగబాబు.


అంతేకాదు మెగా బ్రదర్ నాగబాబు చేతిలో 21.81 లక్షలు ఉన్నాయి. మొత్తం స్థిరాస్తులు 11 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నాడు మెగా బ్రదర్ నాగబాబు. చిరాస్టులు 59 కోట్లు ఉన్నట్లు తెలిపాడు. అలాగే ఇతరులకు ఇచ్చిన అప్పులు మొత్తం కోటి రూపాయలకు పైగా ఉన్నట్లు వివరించాడు నాగబాబు. అయితే మెగాస్టార్ చిరంజీవి అలాగే పవన్ కళ్యాణ్ దగ్గర అప్పు కూడా తీసుకున్నట్లు పేర్కొన్నాడు. ఇప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవి దగ్గర 28 లక్షలు అప్పు తీసుకున్నాడట నాగబాబు. అటు పవన్ కళ్యాణ్ దగ్గర ఆరు లక్షల రూపాయల అప్పు చేశాడట మెగా బ్రదర్ నాగబాబు.  కాగా ఎమ్మెల్సీ పదవి దక్కించుకోగానే మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి వస్తుందని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: