రెండు తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. ఆంధ్ర ప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాలలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఈనెల చివర్లో జరగబోతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారు అయింది. రేపటితో ఎమ్మెల్సీ నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ అలాగే గులాబీ పార్టీలు అభ్యర్థుల వేట షురూ చేశాయి. ఈ రెండు పార్టీలు ఇవాళ సాయంత్రం లోపు అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉంది.


తెలంగాణ రాష్ట్రంలో ఐదు ఎమ్మెల్సీ  సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇందులో కచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ రెండు సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ ఎమ్మెల్యేలు 10 మంది కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఒక్క సీటు కచ్చితంగా రాబోతుంది. మిగిలిన నాలుగు సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే ఛాన్స్ ఉంది. అయితే ఆ నాలుగు సీట్ల కోసం... కాంగ్రెస్ పార్టీలో ఆశవాహకులు విపరీతంగా పెరిగిపోయారు.  విజయశాంతి నుంచి మొదలుకొని సామ రామ్మోహన్ రెడ్డి వరకు అందరూ పోటీ పడుతున్నారు.

 
ముఖ్యంగా మహిళల కోటలో ఎమ్మెల్సీ స్థానం కోసం విజయశాంతి అలాగే సునీతారావు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో సునీతారావు పార్టీలో కీలకంగా ఉన్నారని ఆమెకు పదవి ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి కి కూడా ఈసారి ఎమ్మెల్సీ పదవి రాబోతుందట. గతంలో వేం నరేందర్ రెడ్డి కి ఎమ్మెల్సీ పదవి కోసం... టిడిపి పార్టీ ప్రయత్నించింది. ఆ సమయంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు వేమనరేందర్ రెడ్డి కి... కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి వ్యూహాలు పన్నుతున్నారట. విజయశాంతి స్థానంలో... వేం నరేందర్ రెడ్డి పేరు ప్రస్తావించారట తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీనికి కాంగ్రెస్ పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వేం నరేందర్ రెడ్డి తో పాటు సామ రామ్మోహన్ రెడ్డి, అద్దంకి దయాకర్, బండి సుధాకర్ గౌడ్, చరణ్ కౌశిక్ యాదవ్,  హరకర వేణుగోపాల్, మైనారిటీ కోటాలో షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి కూడా లిస్టులో ఉన్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: