తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు . ఒక స్టైల్ ప్రారంభించారు..తప్పు చేస్తే మందలించడం వంటివి మొదలుపెట్టారు..తిరువూరు ఎమ్మెల్యే విషయంలో లేకపోతే నరసరావుపేట ఎమ్మెల్యే విషయంలో అది ఒక అస్పెక్ట్ .. పర్ఫామెన్స్ తీరు లేకపోతే స్టేజి మీద కొన్నికొన్ని మార్కాపురానికి అవి కావాలి ఇవి కావాలని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అడిగారట.. ఆ తర్వాత పార్టీ పరంగా నీ పనితీరే బాగోలేదంటూ మందలించడం అది కూడా కార్యకర్తలందరూ ఉన్నప్పుడే ఆ ఎమ్మెల్యేను మందలించడంతో ఒక సంచలనంగా మారింది.


మొదటిసారి ఇలాంటి తరహాలో జరిగినటువంటి పనులు సాధారణంగా ఇలాంటి సమయాలలో లోపలికి పిలిచి మరి మాట్లాడేటువంటి చంద్రబాబు నాయుడు. ఈ విధంగా చేయడం అన్నది అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే నీ పర్ఫామెన్స్ 104వ స్థానంలో ఉన్నదని.. 37 పర్సెంటేజ్ మాత్రమే వచ్చిందని అంటే పాస్ మార్కు కూడా కాదు ఫెయిల్ అయిపోయావు అంటూ తెలియజేశారట.. రాష్ట్రవ్యాప్తంగా 15% మెజారిటీతో గెలిచాము కూటమిలో భాగంగా అంటూ తెలిపారు.. మీ నియోజకవర్గంలో 7.32% మాత్రమే మెజారిటీ వచ్చింది మీకు అంటూ తెలిపారు.



ఇది చాలా విచిత్రమైనటువంటి ప్రశ్న.. ఒకవేళ కొన్నిచోట్ల 5000 లోపు తేడాతో గెలిచి ఉండవచ్చు.. ఒకచోట 10,000 తేడాతో గెలిచి ఉండవచ్చు.. దానికి అతను ఏమి చేస్తారు.. మరొక అంశం ఏమిటంటే అడిగింది చెప్తే చేస్తానని చెప్పాలా?.. లేకపోతే దాని గురించి మాట్లాడకపోతే నష్టమేమీ లేదు.. స్టేజ్ మీద ఆ ఊరి ప్రజలు లేకపోతే ఆ ఊరి కార్యకర్తలు అందరూ ఉన్నప్పుడు ఎమ్మెల్యేను అవమానించడం అక్కడ నేతలకు నచ్చలేదు.. ఇక తనకు కావలసిన వారికి  ఇది కావాలండి వీళ్ళకి ఇది కావాలని అడిగి చేయకపోతే.. నువ్వు ఎందుకు మాకు చేసి పెట్టలేదంటూ  రేపటి రోజున కార్యకర్తలే ఎదురు తిరుగుతారు.. కీలకమైన పాయింట్ ఏమిటంటే ఈటీ కి సంబంధించింది. సభ్యత్వ నమోదుకు సంబంధించినటువంటి అంశమట. సభ్యత్వాలు ఎవరికైనా నచ్చి రావాలి కానీ బలవంతంగా అంట కట్టేది కాదు కదా అంటూ ప్రశ్నిస్తున్నారు?. అయితే నవ్వుతూనే వేదిక మీద తీవ్రస్థాయిలో ఇలా విరుచుకు పడడం సంచలనంగా మారింది. మరి ఎమ్మెల్యే ఏమంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: