
అదేమిటంటే వరుసగా మూడో ఆడబిడ్డకు జన్మనిస్తే ఆ ఆడపిల్ల పేరుమీద 50వేల రూపాయలు బ్యాంకు ఖాతాలో తాము జమ చేస్తామంటూ తెలియజేశారు.. ఒకవేళ ఎవరికైనా మూడవసారి మగ బిడ్డ వరుసగా పుడితే ఒక ఆవు ,దూడను కూడా అందిస్తామంటూ తెలియజేశారు. అయితే తాను నరేంద్ర మోడీ, నారా లోకేష్, చంద్రబాబు నాయుడు వంటి ప్రకటన స్ఫూర్తితోనే విజయనగరం పార్లమెంటు పరిధిలో ఈ కార్యక్రమాన్ని తాను శాశ్వతంగా కూడా అమలు చేయబోతున్నట్లు తెలియజేశారు ఎంపీ.
అయితే ఈ విషయం విన్న చాలా మంది కూడా ఆ ఎంపీ ని ప్రశంసిస్తూ ఉన్నారు. ఇక హోంమినిస్టర్ వంగలపూడి అనిత మాట్లాడుతూ సమాజంలో ఆడపిల్లలే ముఖ్యమని భావన వస్తోందని ఇందుకు కారణం ఎన్టీఆర్ అంటూ తెలియజేశారు. ఆయన చొరవతోనే అసెంబ్లీలో అధ్యక్ష అనే స్థాయికి మహిళలు ఎదిగారు అంటూ తెలిపారు హోమ్ మినిస్టర్ అనిత. ఇక సీఎం చంద్రబాబు డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదగాలని అలాగే భద్రత విషయంలో ప్రత్యేకమైన దృష్టి కూడా సాధించాలని తెలియజేశారు. మహిళలు బాలికల సేఫ్టీ కోసం ఎన్నో రకాల చర్యలను కూడా తీసుకుంటున్నామని.. ప్రతి ఒక్కరూ కూడా మగ పిల్లలను కూడా జాగ్రత్తగా, శిక్షణతో పెంచాలి అంటూ తెలిపారు. మొత్తానికి ఎంపి ప్రకటించిన విషయం వైరల్ గా మారుతున్నది.