ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... వైసిపి పార్టీ నేతల అరెస్టులు వరుసగా జరుగుతున్న సంగతి తెలిసిందే.  జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.  చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ లాంటి ఎంతోమంది లీడర్లను... తిట్టిన వైసిపి నేతలను ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు. పాత కేసులు తీసి.. వాళ్లపై కేసులు పెడుతున్నారు. అంతేకాదు చాలామంది అరెస్ట్ కూడా అయ్యారు. బోరుగడ్డ అనిల్, పోసాని కృష్ణ మురళి,  ఇంకా చాలామంది వైసిపి నేతలు అరెస్ట్ అయ్యారు.


అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు టిడిపిని గట్టిగానే టార్గెట్ చేశారు బోరుగడ్డ అనిల్. అయితే అతనిపై కేసులు నమోదు చేసిన ఏపీ పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. అయితే అరెస్టు చేసిన తర్వాత జైల్లో కూడా... సకల మర్యాదలతో అనిల్... ఎంజాయ్ చేశాడని చెప్పవచ్చు. ఏపీ పోలీసులు చాలామంది జైల్లో అనిల్ కు సహకారం చేశారట. అయితే తన తల్లి అనారోగ్యం కారణంగా బెయిల్ అప్లై చేసుకున్న అనిల్ కు... కోర్టు.. అనుమతులు ఇచ్చింది. దీంతో బెయిల్ పైన... జైలు నుంచి రిలీజ్ అయ్యారు అనిల్.


చెన్నైలో తన తల్లి అనారోగ్యంతో... ఆస్పత్రి పాలైనట్లు... అనిల్ పేర్కొన్నాడట. దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి చెన్నై వెళ్లిపోయాడు. కానీ అతనిపైన టిడిపి సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేసింది. తన తల్లి ఆరోగ్యం బాగానే ఉందని... కానీ బెయిల్ కోసం.. అనిల్ తప్పుడు సమాచారం ఇచ్చి జైలు నుంచి విడుదలైనట్లు... నిన్నటి నుంచి కథనాలు వచ్చాయి. అయితే తాజాగా దీనిపై నేరుగా బోరుగడ్డ అనిల్ స్పందించాడు.


ఈ మేరకు ఓ సెల్ఫీ వీడియో... విడుదల చేసిన అనిల్.... కూటమి ప్రభుత్వం పై ఫైరయ్యాడు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఇద్దరు తనపై కుట్రలు చేశారని మండిపడ్డాడు.  తనను చంపేయాలని కుట్రలు చేస్తున్నారని... సంచలన ఆరోపణలు కూడా చేశాడు అనిల్. తన తల్లికి నిజంగానే ఆరోగ్యం బాగాలేదని... ఇలాంటి సమయంలో ఆమెతో తాను ఉండాల్సిందేనని చెప్పుకొచ్చాడు. కానీ కొంతమంది తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు అనిల్. తనకు అండగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే వైసిపి పార్టీ ఉందని తెలిపాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: