
ముఖ్యంగా సోషల్ మీడియాలో సమంతకు భారీ సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ప్రస్తుతం సమంత తెలుగులో పెద్దగా సినిమాలు చేయడం లేదు. చాలా రోజుల నుంచి హిందీలో పలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ అగ్ర హీరోయిన్ గా రాణిస్తోంది. ప్రస్తుతం సమంత బాలీవుడ్ పైనే తన పూర్తి ఫోకస్ పెట్టింది. ఇదిలా ఉండగా.... సమంత ఎన్నో సినిమాలలో నటిస్తూ భారీగా డబ్బులను సంపాదిస్తోంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో సమంత పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ కోట్లలో డబ్బులను సంపాదిస్తోంది. సమంతకు భారీగా ఆస్తులు ఉన్నాయి.
హైదరాబాద్, చెన్నై, ముంబై వంటి నగరాలలో విల్లాలు సైతం ఉన్నాయి. అయితే గత కొన్ని రోజుల క్రితం సమంత హైదరాబాదులో తన ఇల్లును అమ్మేసినట్లు భారీగా ప్రచారాలు సాగాయి. అయితే వాటిలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం సమంత హైదరాబాదులో ఓ ఖరీదైన ఇల్లు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందట. దాదాపు 20 కోట్లకు పైనే ఖర్చుపెట్టి విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసే ఆలోచనలో ఉందట.
ఇక సమంత హైదరాబాదులో ఇల్లును కొనుగోలు చేసి ఇక్కడే ఉండాలని నిర్ణయం తీసుకుందట. ఈ విషయం తెలిసి సమంత అభిమానులు సంతోషపడుతున్నారు. సమంత హైదరాబాదులో ఉండాలని నిర్ణయం తీసుకుందంటే తెలుగులో మళ్లీ సినిమాలు చేస్తుందేమోనని కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ విషయం పైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.