
వైసీపీలో ఉన్నప్పుడు కాస్త దూకుడు గా.. కాస్త వివాదాలతో రాజకీయం చేశారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. అక్కడ ఆయన ఎంత అభివృద్ధి చేయాలని అనుకున్నా ఎందుకో గాని కోపరేషన్ లేకుండా పోయింది. చివరకు ఒకానొక దశలో అప్పట్లో మంత్రలుగా చేసిన వైసీపీ నేతలు పి అనిల్ కుమార్ యాదవ్ .. ఆ తర్వాత కాకాణి గోవర్థన్ రెడ్డితోనూ ఆయనకు ఏ మాత్రం పొసగలేదు. ఇక ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తోనూ ఏ మాత్రం సఖ్యత లేకుండా పోయింది. ఈ విబేధాలు ముదిరి ఆయన పోలీస్ ఉన్నతాధికారుల పై సైతం తన అసహనం వ్యక్తం చేశారు. చివరి దశలో ఆయనను నియోజకవర్గానికి వెళ్లవద్దని వైసీపీ హైకమాండ్ చెప్పాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితుల నుంచి బయటకు వచ్చి న శ్రీథర్ రెడ్డి ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా సరికొత్త రాజకీయం చేస్తున్నారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గం అత్యధికం సిటీలోనే ఉంటుంది. రూరల్ నియోజకవర్గంలో ఉన్న కనీస మౌలిక సమస్యలను గుర్తించిన కోటంరెడ్డి మరీ చిన్న చిన్న సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కంకణం కట్టుకున్నారు. ఇలా రెండు, మూడు వందల పనులను గుర్తించి పక్కనే ఉన్న సిటీ ఎమ్మెల్యే .. మంత్రి నారాయణ సహకారంతో వీటిని త్వరగా పూర్తి చేసేలా నిధులు తెచ్చుకుంటున్నారు. ప్రజలు అడిగిన సమస్యలు కావడంతో వీటి శంకుస్థాపన లను ప్రజలతోనే చేయిస్తూ సరికొత్త రాజకీయం తో ముందుకు వెళుతున్నారు.
ఇక కోటంరెడ్డి వ్యక్తిగతంగా ప్రజలతో కలిసే విధానం .. ఆయన మాట్లాడే తీరు కూడా పూర్తిగా మారిపోయింది. గతంలో ఆయనంటే నియోజకవర్గ ప్రజలకు .. సామాన్యులకు చాలా భయం ఉండేది. ఇప్పుడు కోటంరెడ్డి అందరితో నూ సరదాగా కలిసి పోతున్నారు. ఆయన ఓ ఎమ్మెల్యే లా కాకుండా .. స్నేహ భావంతో దూసుకు పోతున్నాడు. ఏదేమైనా ఇప్పుడు నెల్లూరు రూరల్ లో కోటంరెడ్డి సరికొత్త రాజకీయం తో దూసుకు పోతున్నారు.