- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

కుటుంబ పాలన నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు . నిజంగా కుటుంబం అంతా సేవ చేయాలంటే వెనక ఉండి చేయవచ్చు క‌దా .. వెన‌క ఉన్నా చాలా సేవ చేయోచ్చు .. కుటుంబం అంతా చట్ట సభల్లోకి రావాల్సిన అవసరం లేదు .. దాని బదులు చాలా మంది కొత్తవాళ్లు రావొచ్చు .. దేశం కోసం పోరాటం చేసిన మీ లాంటి ఎంతో మంది యువ‌కుల‌ను కూడా రాజ‌కీయాల్లోకి తీసుకు రావ‌చ్చు .. ఇంత‌సేపు నా ఇంట్లో .. నా కూతురు .. నా కొడుకు .. నేను .. నా మేన‌ళ్లుల్లే రాజ‌కీయాలు అంటే కుద‌ర‌దు .. ఇవ‌న్నీ కూడా జ‌నసేన అధినేత .. ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గతంలో ఒక బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు .. అయితే ఇప్పుడు ప‌వ‌న్ త‌న మాట మీద తానే నిల‌బ‌డ‌డు అన్న విష‌యం అర్థ‌మైపోయింది.


నాడు అన్ని క‌బుర్లు చెప్పిన వ్య‌క్తి ... ఇదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయన తన అన్న నాగబాబు కు ఎమ్మెల్సీ ఛాన్స్ ఇచ్చారు. పైగా నాగ‌బాబు కు 2019 ఎన్నిక‌ల లో త‌మ సొంత పార్ల‌మెంటు స్థానం అయిన న‌ర‌సాపురం సీటు ఇస్తే ఓడిపోవ‌డం తో పాటు మూడో ప్లేస్ తో స‌రిపెట్టుకున్నారు. మొన్న ఎన్నిక‌ల్లోనూ అన‌కాప‌ల్లి ఎంపీ సీటు ఇవ్వాల‌నే అనుకున్నారు. చివ‌ర్లో కుద‌ర‌లేదు. ఇక ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చేస్తున్నారు. నాగాబు ఎమ్మెల్సీ గా ఎన్నికైన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ క్యాబినెట్ లో ఆయన మంత్రి కూడా అవుతున్న‌ విషయం తెలిసిందే.


బహిరంగ వేదికలపై అప్పటి అవసరాల కోసం నోటికి ఏది వ‌స్తే అది చెప్పటం....ఆ తర్వాత మ‌డ‌మ తిప్పేయ‌డం నేటి రాజ‌కీయ నాయ‌కుల‌కు అల‌వాటు అయిపోయింది. ఈ విష‌యంలో చంద్ర‌బాబు ముందు వ‌రుస‌లో ఉంటార‌న్న చ‌ర్చ‌లు .. ఆయ‌న‌పై ట్రోలింగులు తెలిసిందే. ఇప్పుడు ఆయ‌న తో క‌లిసి ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం లో ఉన్న ప‌వ‌న్ కూడా ఇదే పంథాలో ముందుకు వెళుతున్న ప‌రిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: