
ముఖ్యంగా సినీ నటి విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడం హాట్ టాపిక్‌గా మారింది. ఒకప్పుడు బీజేపీలో చక్రం తిప్పిన విజయశాంతి, ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరినా సరైన గుర్తింపు కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. గతంలో టికెట్ దక్కనప్పుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినా, పార్టీలోనే కొనసాగడం ఆమెకు ఇప్పుడు కలిసొచ్చింది. విజయశాంతికి ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు.
మరోవైపు, పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం సరైన నిర్ణయమే అయినా, సీనియర్ నేతలకు కాదని ఆయనకు అవకాశం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ, పార్టీలో కష్టపడుతున్న కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలనే సంకేతాన్ని కాంగ్రెస్ పంపిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు, బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వాక్చాతుర్యం కలిగిన నాయకుడిగా దయాకర్ గుర్తింపు పొందారు.
ఇక మూడో స్థానంలో కేతావత్ శంకర్ నాయక్‌ను ఎంపిక చేయడం వెనుక కూడా వ్యూహం దాగి ఉంది. నలుగురు అభ్యర్థుల జాబితాను మల్లికార్జున్ ఖర్గే ఆమోదించగా, కేసీ వేణుగోపాల్ విడుదల చేశారు. ఈ లిస్ట్‌లో అద్దంకి దయాకర్‌కు మొదటి ప్రాధాన్యత ఇవ్వగా, కేదా శంకర్ నాయక్‌కు రెండో స్థానం, విజయశాంతికి మూడో స్థానం దక్కింది.
అయితే, ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. నాలుగో స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ సీపీఐకి కేటాయించడం. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, జనసేనకు మొండిచెయ్యి చూపిన వేళ, తెలంగాణలో కాంగ్రెస్ మాత్రం సీపీఐకి స్థానం ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక ఎత్తుగడా లేక పొరపాటా అనేది వేచి చూడాలి. మొత్తానికి కాంగ్రెస్ విడుదల చేసిన ఈ ఎమ్మెల్సీ లిస్ట్ మాత్రం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.