
నామినేషన్ల ప్రక్రియకు ఒక్కరోజు ముందుగాను... తమ అభ్యర్థిని ప్రకటించారు కేసీఆర్. తెలంగాణ ఉద్యమకారుడు, గులాబీ పార్టీ సీనియర్ నాయకులు దాసోజు sravan KUMAR' target='_blank' title='శ్రవణ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>శ్రవణ్ కుమార్ కు.. ఎమ్మెల్సీ టికెట్ ఇస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించడం జరిగింది. ఈ మేరకు సాయంత్రం ప్రకటన వచ్చింది. తెలంగాణ ఉద్యమం సమయంలో దాసోజు శ్రవణ్ కుమార్... చేసిన ఉద్యమాలు అంతా ఇంతా కాదు. కేసీఆర్ వెంట ఉండి నడిచి... ఉద్యమాన్ని ఉరకలెత్తించారు.
దాదాపు 20 సంవత్సరాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్న దాసోజు శ్రవణ్ ఇప్పటివరకు ప్రజా ప్రతినిధిగా ఎన్నిక కాలేదు. ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా అన్ని పార్టీల నుంచి అవకాశాలు వచ్చినా కూడా ఆయన గెలవలేకపోయారు. మొన్నటికి మొన్న కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్ కు ఎమ్మెల్సీ పదవి వస్తుందని అందరూ అనుకున్నారు.
కానీ అప్పటి గవర్నర్ తమిలి సై రాజకీయాల కారణంగా దాసోజు శ్రవణ్ కు ఎమ్మెల్సీ పదవి రాలేదు. ఇప్పుడు అదే పదవి కోదండరాం అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇది గుర్తించిన కేసీఆర్.... ఈసారి ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ కు అవకాశం ఇచ్చారు. అయితే కెసిఆర్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల గులాబీ పార్టీ నేతలతో పాటు తెలంగాణ ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ ఉద్యమ కాలంనాటి కేసిఆర్... కనిపిస్తున్నారని కొనియాడుతున్నారు.