
ఈ నియోజకవర్గం నుంచి ఎం.వీ.ఎస్.ఎన్ వర్మకు టికెట్ దక్కాల్సి ఉండగా పిఠాపురం నుంచి జనసేన తరపున పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానని ప్రకటించడంతో వర్మకు భారీ షాక్ తగిలింది. కూటమి కోసం వర్మ త్యాగం చేస్తే ఆ త్యాగానికి తగ్గ ఫలితం అయితే దక్కలేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఎమ్మెల్సీ సీటు దక్కకపోవడం ఆశావహుల్లో అసంతృప్తికి కారణమవుతోంది.
పార్టీ కోసం త్యాగం చేస్తే తమకు దక్కిందేమిటని వర్మ ఫీలవుతున్నారని సమాచారం అందుతోంది. తనకు ఎమ్మెల్సీ పదవి రావడం పక్కా అని ఆయన ఫీల్ కాగా అందుకు భిన్నంగా జరగడం వల్ల ఆయన ఫీలైనట్టు తెలుస్తోంది. వర్మ కూటమిలో కొనసాగితే ఆయనకు భవిష్యత్తు ఉండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వర్మ నోరు జారడం వల్లే పదవి దక్కలేదనే కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి.
కూటమి కార్యకర్తలకు తీవ్రస్థాయిలో అన్యాయం చేస్తోందని కార్యకర్తలను ఎదగనీయడం లేదని కూడా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వర్మను అందరూ కలిసి మోసం చేశారనే కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి. పార్టీ కోసం కష్టపడిన వాళ్లు చంద్రబాబు ఎప్పుడూ సీటు ఇవ్వరని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. వర్మ తన అసంతృప్తిని అనుచరుల దగ్గర చెప్పారని భోగట్టా. రాబోయే రోజుల్లో అయినా కూటమి సర్కార్ వర్మకు తగిన న్యాయం చేస్తుందేమో చూడాల్సి ఉంది. కూటమి సర్కార్ పాలన విషయంలో ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.