
ఈ సంస్థకు అవసరం లేకుండా మరొక 200 మంది పని చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారట. వీరిని వెంటనే తొలగించమని ఉత్తర్వులు చేపట్టినట్లుగా అధికారులు తెలియజేస్తున్నారు..ప్రస్తుతం 925 మందే ఉన్నారని వెల్లడించారు.. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని విజిలెన్స్ విభాగానికి సైతం లేఖ అందించినట్లు తెలుస్తోంది .APSFL మొదటి దశ పనులు చేస్తున్నటువంటి వారందరికీ బిల్లులు నిలిపివేసేలా విజిలెన్స్ అధికారులు ఒక లేఖ కూడా రాశారట.. 2018-19 మధ్య సీసీటీవీల నిర్వహణకు సంబంధించి కాంట్రాక్టుకు 60 కోట్లు చెల్లించారని.. అలాగే వ్యూహం చిత్రానికి వర్మకు డబ్బులు ముట్ట చెప్పారని సిఐడిలో కేసు నమోదు చేసి విచారణ జరుగుతోంది.
ఇటీవలే సిఐడి అధికారులు కూడా అన్నిటిని ఎంక్వయిరీ చేస్తున్నారని ప్రస్తుతం ఇంటర్నల్ ఆడిట్ జరుగుతోందట. 2017-18 జీఎస్టీ చెల్లింపు వ్యత్యాసం 18% వడ్డీ కలుపుకొని మరి 377 కోట్లు చెల్లించారంటూ తెలియజేస్తున్నారు. అయితే ఫైబర్ నెట్ సంస్థ ఏడాది టర్నోవర్ తగ్గించి మరి 142.46 కోట్ల రూపాయలు జీఎస్టీ చెల్లింపు ఇచ్చినట్లు అధికారులు గుర్తించారట.దీనిపైన విచారణ జరిపించేందుకు రికార్డులను కూడా అందించాలని ప్రభుత్వం కోరిందట. మొత్తానికి ఏపీ ఫైబర్ నెట్ లో పనిచేస్తున్న 200 మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్లు తెలియజేస్తోంది ఆ సంస్థ.