
ప్రముఖ కంపెనీలు సైతం గత సంవత్సరం సేల్స్ ఆధారంగా ఈ సంవత్సరం ఏసీలను ఉత్పత్తి చేస్తున్నట్టు సమాచారం అందుతోంది. అయితే ఏసీల తయారీకి అవసరమైన ముడి భాగాలకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుస్తోంది. విడి భాగాల లభ్యత తగ్గడంతో ధరలు పెరుగుతున్నాయని సమాచారం అందుతోంది. ఏసీ తయారీ వ్యయం గతంతో పోలిస్తే ఊహించని స్థాయిలో పెరుగుతోంది.
అందువల్ల ఏసీల ధరలు 1500 రూపాయల నుంచి 2000 రూపాయల మేర పెరిగే ఛాన్స్ అయితే ఉంది. ఏసీలను కొనుగోలు చేసేవాళ్లు ఈ విషయాలను కచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఏసీలను కచ్చితంగా కొనుగోలు చేయాలని భావించే వాళ్లు వెంటనే కొనుగోలు చేస్తే మంచిదని చెప్పవచ్చు. సాధారణంగానే ఏసీల ధరలు ఎక్కువగా ఉంటాయనే సంగతి తెలిసిందే. వీటి ధరలు పెరిగినా సామాన్యులపై ఆ ప్రభావం పెద్దగా పడే ఛాన్స్ లేదు.
ఏసీలను కొనుగోలు చేసేవాళ్లు కచ్చితంగా 5 స్టార్ ఏసీలను కొనుగోలు చేయడం ద్వారా కరెంట్ బిల్లును ఆదా చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఏసీలకు సంబంధించి ఆన్ లైన్ లో కొనుగోలు చేసేవాళ్లు రివ్యూలను చెక్ చేసుకుని కొనుగోలు చేయడం మంచిది. ఏసీలను కొనుగోలు చేస్తే కరెంట్ బిల్లులు సైతం ఊహించని స్థాయిలో పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఏసీలను రూమ్ అవసరాలకు అనుగుణంగా ఎంచుకోవాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు.