కడప జిల్లాలో తాజాగా రాజకీయాలు ఆసక్తిని కనిపించేలా చేస్తున్నాయి.. ప్రొద్దుటూరులో టిడిపిలోకి చేరిన ముగ్గురు కౌన్సిలర్లు సైతం మళ్లీ తిరిగి వైసిపి పార్టీలోకి చేరడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇటీవలే ప్రొద్దుటూరు మున్సిపాలిటీ కౌన్సిలర్లు సైతం వైసీపీ పార్టీని వీడి టిడిపిలోకి చేరగా ఇందులో మళ్ళీ ముగ్గురు తిరిగి సొంత పార్టీకి చేరారట.. అక్కడ మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి సమక్షంలో.. రాగాల శాంతి, కొల్లు అరుణ, అనిల్ కుమార్ వంటి వారు వైసీపీ పార్టీలోకి చేరారట. వైసీపీ నుంచి టిడిపిలోకి వెళ్లిన వీరు అనంతరం అక్కడ గౌరవం లేకపోవడంతో తిరిగి మళ్ళీ వైసీపీ పార్టీలోకి చేరారని తెలిపారు మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి.


అయితే ఈ ముగ్గురు కౌన్సిలర్లు సైతం టిడిపి చేరే సమయంలో వీరిని అభిప్రాయాన్ని కూడా గౌరవించామంటూ తెలిపారు. వైసీపీ నుంచి వెళ్లిపోయిన వీరు మళ్ళి తిరిగి అదే పార్టీలోకి రావడం చాలా ఆనందంగా ఉందంటూ కూడా తెలియజేయడం జరిగింది శివప్రసాద్ రెడ్డి.. మొత్తం మీద పొద్దుటూరుల 41 మున్సిపాలిటీ వార్డులు ఉన్నప్పటికీ ఇందులో 40 స్థానాలను వైసీపీ గెలిచినది కేవలం ఒక్క స్థానంలో టిడిపి విజయాన్ని అందుకోగా అయితే టిడిపి నుంచి గెలిచిన ఆ ఒక్కరు కూడా వైసీపీలోకి రావడంతో అక్కడ టిడిపికి బలం లేకుండానే పోయిందట.


కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పొద్దుటూరు ఎమ్మెల్యే అయినా  వరదరాజుల రెడ్డి వైసీపీ పార్టీ నుంచి 18 మంది కౌన్సిలర్లను టిడిపిలోకి చేర్చుకున్నప్పటికీ మరో ముగ్గురు కౌన్సిలర్లు టిడిపిలోకి చేరితే చైర్మన్ పదవి వస్తుందని భావించిన కానీ ఈ క్రమంలోనే శివప్రసాద్ రెడ్డి మున్సిపాలిటీ చైర్మన్ పీఠం పోగొట్టుకోకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారట. దీంతో తిరిగి మళ్ళీ టిడిపి పార్టీలో చేరిన వారు వైసీపీ పార్టీలోకి వచ్చారు. దీంతో మున్సిపాలిటీ బలం టిడిపికి 15 పడిపోగా.. వైసిపి పార్టీకి 25 కు చేరిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: