ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను దాదాపు ఖరారు చేసింది కూటమి సర్కార్. ఇప్పటికే నాగబాబు తో పాటు.. నలుగురు అభ్యర్థులను ప్రకటించిన టిడిపి కూటమి సర్కార్... తాజాగా  బిజెపి పార్టీ అభ్యర్థిని కూడా ప్రకటించింది.  మొత్తం ఐదు స్థానాలు ఉండగా... మూడు టీడీపీకి వెళ్లాయి. జనసేన తరఫున నాగబాబు బరిలో ఉన్నారు. ఇక బిజెపికి ఒక సీటు ఇచ్చినందుకు కూటమి నిర్ణయం తీసుకుంది. ఈ తరుణంలోనే ఏపీ మాజీ బిజెపి అధ్యక్షులు... సోము వీర్రాజు పేరును ఫైనల్ చేసింది కూటమి.


గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షులుగా సోము వీర్రాజు పని చేశారు. అయితే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు సోము వీర్రాజును... తొలగించిన బిజెపి పార్టీ... ఏపీ బీజేపీ అధ్యక్షులుగా పురందరేశ్వరిని ఫైనల్ చేసింది. అయితే అప్పటినుంచి సోము వీర్రాజుకు బిజెపి పార్టీలో న్యాయం జరగడంలేదని వాదన తెరపైకి వచ్చింది. రాజమండ్రి ఎంపీ టికెట్ కోసం కూడా సోము వీర్రాజు చాలా ప్రయత్నాలు చేశారు.


కానీ చివరికి ఆ సీటు కూడా... పురందరేశ్వరికి దక్కింది. అయితే మొదటి నుంచి బిజెపి పార్టీ కోసం పనిచేస్తున్న సోము వీర్రాజుకు అన్యాయం... జరుగుతోందని కొంతమంది ఏపీ బీజేపీ నేతలు కూడా అధిష్టానానికి సమాచారం ఇచ్చారు. ఈ తరుణంలోనే బిజెపి పార్టీ తరఫున సోము వీర్రాజుకు... ఛాన్స్ వచ్చింది. ఐదు సీట్లకు ఐదు సీట్లు గెలుచుకునే అవకాశం ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఉంది. వైసీపీకి 11 స్థానాలు ఉన్న నేపథ్యంలో... ఎలాంటి పోటీ లేకుండానే... కూటమి ఐదు సీట్లు గెలుచుకుంటుంది.

ఇది ఇలా ఉండగా... పిఠాపురం వర్మ తనకు ఎమ్మెల్సీ ఇవ్వకపోవడంపై కాస్త అసహనంతో ఉన్నాడట. పిఠాపురం అసెంబ్లీ టికెట్ విషయంలో పవన్ కళ్యాణ్ కోసం భారీ త్యాగమే చేశారు పిఠాపురం వర్మ. అప్పుడు గనుక ఇండిపెండెంట్గా పిఠాపురం వర్మ పోటీ చేసి ఉంటే పవన్ కళ్యాణ్ గెలవడం చాలా కష్టం అయ్యేది. అయితే ఎమ్మెల్సీ ఆఫర్ అప్పట్లో ఇచ్చి... వర్మను కూల్ చేశారు చంద్రబాబు. అయితే తాజాగా ప్రకటించిన ఎమ్మెల్సీ సీట్లలో కూడా వర్మకు ఛాన్స్ దక్కలేదు. దీంతో టీడీపీ పై కాస్త అసహనంతో ఉన్నారట వర్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: