
ఇంటర్ చదువుతున్న విద్యార్థి ఓ ముగ్గురు పిల్లల తల్లితో పారిపోయాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగపూర్ లో చోటు చేసుకుంది. వీరిద్దరూ ఒకే ప్రాంతంలో ఉంటున్నారు. వీరిద్దరి మధ్య గత కొంత కాలం నుంచి పరిచయం ఏర్పడింది. ఇద్దరికీ వయసులో చాలా తేడా ఉండడంవల్ల వీరి సంబంధాన్ని ఎవరు తెలుసుకోలేకపోయారు. ఆ పరిచయం అది తక్కువ సమయంలోనే అక్రమ సంబంధానికి దారితీసింది.
మహిళ వయసు 36 సంవత్సరాలు. బాలుడి వయసు 20 ఏళ్లు. వీరిద్దరి మధ్య ఉన్న శారీరక సంబంధం కారణంగా ఇద్దరూ పారిపోయి వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ మహిళకు ఇదివరకే వివాహం జరిగి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ ఆ బాలుడు ఆ మహిళతో కలిసి పారిపోయారు. బాలుడు కనిపించకపోయేసరికి తల్లిదండ్రులు కంగారుతో పోలీస్ స్టేషన్ లో పోలీసులను ఆశ్రయించారు.
తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాలుడిని గుర్తించి అతడిని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. అంతేకాకుండా మహిళను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లినట్లుగా తెలిపారు. తమ కుమారుడికి ఆ మహిళ ఏదో మాయమాటలు చెప్పి ఇలా చేసిందని బాలుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇక ఈ విషయం పైన మరింత సమాచారం వెలువడాల్సి ఉంది.