ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ కు చివరి రోజున‌ సోమవారం అనగా ఈరోజు ఏపీలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులు ఎవరో తెల్లిపోయింది .. ఎమ్మెల్యేల కోటాలో టిడిపి , జనసేన , బిజెపి కూటమి ప్రభుత్వం సులువుగా గెలుచుకున్న అన్ని సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసింది .. కూటమిలో పెద్దగా ఉన్న టిడిపి మూడు స్థానాలతో సరిపెట్టుకోగా జనసేన , బీజేపీ చేరొకటి తీసుకున్నాయి .. అయితే ఇందులో బీజేపీ అన్యోన్యంగా ఒక సీటును పొందటం ఇక్కడ గమనార్హం .. ఆ పార్టీ తమ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సీనియర్ నేత సోము వీర్రాజును ప్రకటించింది .. ఈరోజు చివరి రోజు కావటంతో సోమవారం ఆయన నామినేషన్ దాఖలు చేయబోతున్నారు ..


జనసేన తరఫున ఇప్పటికీ ఆ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు నామినేషన్ వేశారు .. ఇక టిడిపి ఆదివారం ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది .. బీద రవిచంద్ర , కావలి గ్రీష్మ , బీటీ నాయుడులకు అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే . అయితే ఏపీ బీజేపీ ఎమ్మెల్సీగా సోము వీర్రాజును ఎంపిక చేయడం ద్వారా చంద్రబాబుకు బిజెపి ఒక విధంగా గట్టి షాక్ ఇచ్చిందని చెప్పాలి .. ఏపీ బీజేపీలో చంద్రబాబును తీవ్రంగా వ్యతిరేకించేది సోము వీర్రాజు మాత్రమే .. 2014 - 19 మధ్య ప్రభుత్వం లో భాగమైనప్పటికీ కూడా చంద్రబాబు పై ఉన్న వ్యతిరేకతను ఎక్కడ దాచుకోలేదని అంటారు ..


అలాగే మరో పక్క చంద్రబాబుకు చెక్ పెట్టేందుకు బిజెపి సోమును ఎంపిక చేసిందా ? అనే అనుమానాలు కూడా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు . ఇక ఆంధ్రప్రదేశ్ 5 ఎమ్మెల్సీల్లో రెండు కాపు వర్గానికి తగ్గడం ఇక్కడ మరో విశేషం .. అయితే ఒకటి జనసేన నుంచి రెండోది బిజెపి నుంచి .. సోము వీర్రాజు కాపు సామాజిక వర్గానికి చెందినవారే .. అయితే ఇక్కడ వాస్తవానికి టిడిపి నుంచి వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ వస్తుందని అంతా అనుకున్నారు .. అయితే కాపు సామాజిక వర్గానికి చెందిన నాగబాబు ఎమ్మెల్సీ కావటం తో రాధ‌కు ఎలాంటి లాభం లేకుండా పోయింది .. బీజేపీ మాత్రం కాపు నాయకుడిని ఎమ్మెల్సీగా చేయటం కొంత ఊహించని పరిణామం . ఇక మరి బిజెపి వ్యూహం ఏ విధంగా ఉందో అనేది కాలమే సమాధానం చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: