ప్రణయ్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు వెలువడింది. ప్రణయ్ హత్య కేసులో ఏకంగా... ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు విధించింది నల్గొండ కోర్టు. అటు ఏ2 శుభాశ్ శర్మకు ఉరి శిక్ష విధించింది కోర్టు. నిందితులందరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఎస్సీ, ఎస్టీ సెషన్స్ రెండో అదనపు న్యాయ స్థానం విధించడం జరిగింది.


302, 120 ఐపీసీ, 109, 1989 సెక్షన్ ఐపీసీ ఇండియన్ ఇండియన్ ఆర్మ్ యాక్ట్ 1959 ప్రకారం శిక్ష విధించింది నల్గొండ కోర్టు.  శిక్ష తగ్గించాలని న్యాయమూర్తిని వేడుకున్నారు నేరస్థులు. కానీ...  ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు చాలా కఠినంగానే వ్యవహరించింది.  ఈ తరుణంలోనే... ప్రణయ్ హత్య కేసులో ఒకరికి ఉరిశిక్ష, మిగిలిన వారికి జీవిత ఖైదు విధించింది.


ప్రణయ్ హత్య కేసులో  ముగ్గురు నిందితులు...ఇప్పటికే జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.  వాస్తవంగా సుపారీ ఇచ్చి ప్రణయ్‌ను హత్య చేయించాడు అమృత తండ్రి మారుతీ రావు.  ప్రణయ్ హత్య కేసులో ఉగ్రవాది అస్గర్‌ అలీకి సుపారీ ఇచ్చాడు మారుతీరావు.  ఏకంగా ఏడుగురితో గ్యాంగ్‌ను ఏర్పాటు చేశాడు అస్గర్‌ అలీ.  గుజరాత్‌ మాజీ హోంమంత్రి హరెన్‌ పాండ్యా హత్య కేసులో.. నిందితులతో కలిపి గ్యాంగ్ ఏర్పాటు చేశాడు అస్గర్‌ అలీ.  


14 సెప్టెంబర్‌ 2018న మిర్యాలగూడలో ప్రణయ్‌ హత్య చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.  ప్రణయ్ భార్య అమృత ప్రెగ్నెంట్‌ ఉన్న సమయంలో ఈ సంఘటన జరిగింది. ఆస్పత్రి సమీపంలో ప్రణయ్‌ను వెనుక నుంచి వచ్చి.. పొడిచి చంపేశారు దుండగులు. దాదాపు 7 ఏళ్ల తర్వాత... ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది.  ఇక అటు ప్రణయ్‌ మరణించిన తర్వాత..అతని కుటుంబంతో జీవించింది అమృత. ఇక అమృతకు ఒక కొడుకు కూడా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: