అధికారం చేతులో ఉన్నప్పుడు  లేనిపోని హంగులకు పోవటం .. ఎన్నికల వరకు వెళ్ళటం .. ఆ సమయంలో ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీసే ఎత్తులు వేయడం .. డబ్బులు భారీగా పంచటం .. రాజకీయ విలువలను పక్కనపెట్టి విమర్శలను పట్టించుకోకుండా తమ పట్టును చూపించబోవటమే లక్ష్యంగా వ్యవహరించే దోరణకి భిన్నంగా వివహించింది తెలంగాణ అధికారపక్షం .. తాజాగా తెలంగాణలో జరుగుతున్న 5 ఎమ్మెల్సీ ఎన్నికలవేళ .. గత అధికార పక్షానికి భిన్నంగా ఈసారి కాంగ్రెస్ వ్యవహరించింది .. ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఎమ్మెల్సీ కోట ఎన్నికలను పోలింగ్ జరగకుండా .. ఏకగ్రీవాల దిశగా సంచల నిర్ణయం తీసుకుంది.
 

మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా .. అధికార కాంగ్రెస్ కు నలుగురు అభ్యర్థులు గెలుచుకునే చాన్స్ ఉంది .. తమకు మిత్రుడైన సిపిఐ కు ఒక స్థానాన్ని వదిలిపెట్టి .. మిగిలిన మూడు స్థానాలకే కాంగ్రెస్ తమ అభ్యర్థులను ప్రకటించింది .. ప్రతిపక్ష బీఆర్‌స్‌కు గెలిచే అవకాశం అన్న ఒక స్థానాన్ని వదిలేయడం ద్వారా ఎన్నికలకు అవకాశం లేకుండా చేసింది.   ఇక దీంతో తాజా ఎన్నికలు గడువు పూర్తయిన వెంటనే ఏకగ్రీవం కావడం ఖాయమని చెప్పాలి .. ఈ మొత్తం ఎపిసోడ్ చూసిన తర్వాత కాంగ్రెస్ ఎలాంటి అత్యాశకు పోకుండా .. కుట్రలకు తెర తీసే రాజకీయాలకు దూరంగా ఉన్నామన్న సంకేతాలను ప్రజల్లోకి పంపింది.

 

ఇక తాజా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు లాంఛనమే అని చెప్పాలి నామినేషన్లకు తుది గడువు ఈనెల 11 అంటే మంగళవారం సాయంత్రానికి పూర్తి కానున్నాయి .. ఇక నామినేషన్ పత్రాల పరిశీలన అభ్యర్థుల ఉపసంహరణకు 13 మధ్యాహ్నం వరకు గడువు ఉంటుంది .. ఐదు స్థానాలకు ఐదుగురు అభ్యర్థులే పోటీలో ఉన్న నేపథ్యంలో మార్చి 20న జ‌రగాల్సిన ఎన్నికలు జరిగే పనిలేదు .  దీంతో ఎన్నికలు జరిగే అవకాశం లేని క్రమంలో ఉపసంహరణకు గడువు ముగిస్తే 13నే అభ్యర్థులు ఏకగ్రీవం అయినట్లుగా అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించబోతున్నారు .. ఇలా మొత్తంగా పార్టీలు ప్రకటించిన అభ్యర్థులంతా ఎమ్మెల్సీలుగా గెలిచినట్టే .. కేవలం అధికార ప్రకటన మాత్రమే మిగిలి ఉన్నాయి అని చెప్పాలి .

మరింత సమాచారం తెలుసుకోండి:

mlc