పిఠాపురం నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు మరొకసారి హాట్ టాపిక్ గా మారుతోంది. ఎమ్మెల్సీ సీటు పైన వర్మకు తప్పకుండా ఇస్తారని గత కొద్ది రోజులుగా టిడిపి కార్యకర్తలు ఆయన నేతలు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే ఇలాంటి సమయంలోనే వర్మకు భారీ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పిఠాపురంలో గత కొన్ని రోజుల నుంచి వర్మ ఉన్నారు అనే విషయాన్ని కూడా చాలామంది మర్చిపోయారు. దీంతో వర్మ కార్యకర్తలు కూడా ఒక్కసారిగా టిడిపి ఆఫీసు వద్దకు రగిలిపోయి వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.



పిఠాపురంలో టిడిపి పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో వర్మ అక్కడికి వచ్చి పలు వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. వర్మకు ఎమ్మెల్సీ రాకపోవడంతో టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా అసంతృప్తిని తెలియజేశారట. అయితే అక్కడికి భారీ సంఖ్యలో చేరుకున్న కార్యకర్తలను చూసి వర్మ ప్రతి ఒక్కరు కూడా సంయమనం పాటించాలంటూ కోరారు ఎమ్మెల్సీ సీటు విషయంలో కూడా పార్టీ ఇబ్బందులను తాను అర్థం చేసుకుంటానని రాష్ట్రస్థాయిలో వివిధ సమీకరణాల ప్రకారమే ఈ ఎమ్మెల్యే సీట్లను కేటాయించారు అంటూ వెల్లడించారు. ఇలా రాష్ట్ర పరిస్థితులను అందరూ అర్థం చేసుకొని కూటమి ప్రభుత్వానికి సహకరించాలంటూ ఆయన కోరారు.


అందరూ కూడా సీఎం చంద్రబాబు ఆదేశాల బాటలోనే నడుస్తామంటూ వెల్లడించారు. లోకేష్ ,చంద్రబాబు ఆదేశాలకు సైతం తమ కుటుంబం పిఠాపురం నియోజకవర్గంలోని తన టిడిపి కుటుంబం ఎప్పుడూ కూడా సిద్ధంగానే ఉంటుంది అంటూ వెల్లడించారు. పిఠాపురంలో ఉండే పార్టీ కార్యకర్తలను కూడా తాము కాపాడుకుంటామని.. పార్టీ కార్యకర్తలపై ఈగ కూడా వాళ్ళని ఇవ్వమంటూ వారికి ఎలాంటి ఇబ్బందులు కలిగిన వదిలిపెట్టమంటూ తెలిపారు. కూటమి నిర్ణయానికి తన కుటుంబం, తన కొడుకు, తన నాయకులు అందరూ కూడా కట్టుబడి ఉందాం అందరూ కష్టపడి పని చేద్దామంటూ తెలియజేశారు వర్మ. సీఎం చంద్రబాబు చేస్తున్న పనులకు గౌరవం ఇద్దాము అంటూ తెలిపారట. మరి ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: