తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది. గులాబీ పార్టీ నుంచి ఒకరు, కాంగ్రెస్ కూటమి నుంచి నలుగురు బరిలో ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డి ఇచ్చిన పేర్లను కాకుండా కాంగ్రెస్ అధిష్టానం... పార్టీ కోసం కష్టపడ్డ వారికి ఛాన్స్ ఇచ్చింది. ఇందులో విజయశాంతి పేరు కూడా ఉండడం గమనార్హం. దింతో విజయశాంతి ఈసారి ఎమ్మెల్సీ కాబోతున్నారు.

అప్పట్లో మెదక్ ఎంపీగా టిఆర్ఎస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీ అవుతున్నారు రాములమ్మ. వాస్తవానికి... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత.. ఇప్పటివరకు ఆయనను కలవలేదు విజయశాంతి. అసలు కాంగ్రెస్ పార్టీ అంటే తనది కాదన్నట్లుగానే... వ్యవహరించారు రాములమ్మ.  ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇప్పటివరకు ఆయనకు శాలువా కూడా కప్పలేదు రాములమ్మ.  

 అయితే అలాంటి.. రాములమ్మకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ హై కమాండ్. ఆమెకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడమే కాకుండా తెలంగాణ మంత్రివర్గంలో కూడా ఛాన్స్ ఇస్తారని చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమకారులుగా రాములమ్మకు మంచి పేరు ఉంది. అదే సమయంలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన పోరాడి.. కాంగ్రెస్ పార్టీకి  పనిచేశారు విజయశాంతి. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫైర్ బ్రాండ్ గా రాములమ్మకు పేరు ఉంది.

 ఆమె ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చినా కూడా చెల్లుబాటు అవుతుంది. అందుకే ఆమెను తెలంగాణ కేబినెట్ లోకి తీసుకొని... మంత్రి పదవి ఇవ్వనున్నారట. అది కూడా తెలంగాణ హోం శాఖ మంత్రి పదవి ఇస్తారని చెబుతున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం ఆ దిశగా అడుగులు వేస్తోందట. అయితే దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. కాగా ఈ నెల చివర్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉంటాయి. దాదాపు ఎన్నికలు ఏకగ్రీవం కాబోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: