
వైసీపీలో రాజకీయ పదవులు ఖాళీగా ఉన్నాయా వీటిని భర్తీ చేసేందుకు క్షేత్రస్థాయి నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారా ? అంటే అవునని అంటున్నారు వైసీపీ నాయకులు. ప్రస్తుతం పలు నియోజకవర్గాలలో పార్టీని ముందుండి నడిపించే నాయకులు కరువయ్యారు. గత ఏడాది జరిగిన ఎన్నికలలో పార్టీ ఓటమి తర్వాత అనేకమంది మౌనంగా ఉన్నారు .. మరికొందరు పార్టీ మారటం ఇలా తమకు నచ్చిన మార్గాలను ఎంచుకోవడంతో పలు నియోజకవర్గాలు ఖాళీ అయ్యాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలలో మరో చిత్రమైన వ్యవహారం తెరమీదకి వచ్చింది. నాయకులు ఉన్న మండల స్థాయిలో పార్టీని పరుగులు పెట్టించే కన్వీనర్లు లేకుండా పోయారు. చాలామంది కూటమి పార్టీలవైపు మళ్ళీ పోయారు. దీంతో నియోజకవర్గ స్థాయిలోని మండలాలలో పార్టీ జెండా మోసేందుకు పెద్దగా ఎవరు ముందుకు రావడం లేదు.
గతంలో నెల జీతాలు ఇచ్చిన దాఖలలో లేవు. కానీ ఇప్పుడు వైసీపీలో మండల .. గ్రామ స్థాయిలో నియమించే వారికి పూర్తిస్థాయిలో పనులు అప్పగించి వారికి నెల జీతాలు ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం. దీనికి అదనంగా నియోజకవర్గ ఇన్చార్జిలు కూడా కొంత చెల్లించాల్సి వస్తుందట. ఇలా అయితే నిబద్ధతతో పనిచేస్తారని వ్యూహం పార్టీలో కనిపిస్తోంది. కన్వీనర్లకు గౌరవ వేతనంగా 15 నుంచి 20 వేల వరకు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో మండల స్థాయిలో పార్టీని పరుగులు పెట్టించే అవకాశం ఉందని వైసీపీ అధిష్టానం లెక్కలు వేసుకుంటుంది. మరవైపు పార్టీలో నెంబర్ 2 లు లేని నియోజకవర్గం కన్వీనర్లను నియమించే ప్రతిపాదన ఉంది ... దీనికి సంబంధించి స్థానిక నాయకులు తమ తమ ప్రాంతాలలో నియమకాలు ఇప్పటికే ప్రారంభించారు. మరి ఇది ఎంత వరకు వర్కవుట్ అవుతుందో ? చూడాలి.