- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . . .

మాట ఇచ్చి దానిని పక్కన పెట్టే విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పై చాలా విమర్శలు ఉన్నాయి. సొంత పార్టీ నేతలే ఈ విషయంలో ఆయనపై విమర్శలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలోనూ ఇదే హాట్‌ టాపిక్ గా మారింది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే రూట్లో వెళుతున్నట్టు కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు అత్యంత కీలకంగా మారిన సీటు పిఠాపురం. కూట‌మి పొత్తు లో భాగంగా ఈ సీటును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కేటాయించారు. తొలుత దీనికి నిరాకరించి ఆగ్రహం వ్యక్తం చేసిన టిడిపి మాజీ ఎమ్మెల్యే వర్మకు ఎమ్మెల్సీ హామీ ఇచ్చి ఒప్పించారు. గత ఎన్నికలలో వర్మ కూడా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తన వంతు ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలలో వర్మకు చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారు.


పొత్తులో భాగంగా అన్న నాగబాబుకు ఎమ్మెల్సీ సీటు ఓకే చేయించుకున్న పవన్ కళ్యాణ్ కూడా వర్మ విషయంలో తన వంతుగా ఒక మాట చెప్పి ఉంటే బాగుండేది కదా అన్న అభిప్రాయం. ఏపీ రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది .. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక మాట చెబితే కచ్చితంగా చంద్రబాబు ఓకే చేస్తారు. గత ఎన్నికలలో తనకోసం వర్మ సీటు త్యాగం చేశారు. అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా వర్మ బాధ్యత నాది అని హామీ ఇచ్చారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వర్మను పక్కనపెట్టి తన అన్న సీటును ఓకే చేయించుకున్నారు. ఈ విషయంలో పవన్ పై కూడా విమర్శలు వస్తున్నాయి. ఇక గత ఎన్నికలలో సీటు తీయడం చేసిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు తో పాటు ఎంతోమంది ఆశావహులకు చంద్రబాబు మరోసారి హ్యాండ్ ఇచ్చి షాక్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: