
దీంతో ఆ జిల్లా పోలీసులు సైతం సీరియస్గా ఎఫెక్ట్ పెట్టి మరి వారిని అరెస్టు చేయడం జరిగింది..గుంటూరు జిల్లా పోలీసులు ఫైనల్ గా అరెస్టు చేశారు .బీఈడీ ప్రశ్నా పత్రం లీకేజ్ వ్యవహారంలో నిందితులను సైతం పెదకాని పోలీసులు సైతం అరెస్టు చేయడం జరిగింది.. ఎస్పీ సతీష్ కుమార్ కార్యాలయంలో నిందితులను కూడా మీడియా ముందు ప్రవేశపెట్టడం జరిగింది.. అయితే ఈ బీఈడీ ప్రశ్నా పత్రాన్ని లీక్ చేసింది వివేకానంద కాలేజీ వాళ్ళు చేశారని.. వివేకానంద కాలేజీ కరస్పాండెంట్ ఏ వన్ రఫీ..A2,A3, గా ఉన్నటువంటి నిందితులు సురేష్, స్వర్ణ రాజుతో కలిసి ఈ క్వశ్చన్ పేపర్ ని లీక్ చేశారట.
సోషల్ మీడియా ద్వారా వీరు ఈ పేపర్ ని లీక్ చేశారనే విషయం తేలింది. ఈ కేసులో సుమారుగా పదిమందికి పైగా అరెస్ట్ కూడా చేశారట.. వీళ్లు తమ కాలేజీలో చదువుతున్నటువంటి వాళ్లకి మంచి మార్కులు రావాలని ఉద్దేశంతోనే ఒక అరగంట ముందు ఆ పేపర్ ని సైతం బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగిందట. ఇప్పుడు ఆ విషయం బయటపడడంతో లోకేష్ చాలా సీరియస్ గా ఈ విషయంపై నిర్ణయం తీసుకొని మరి నిందితులను అరెస్టు చేయించేలా చేశారు. అయితే విద్యార్థిని తల్లితండ్రులు మాత్రం ఇలా చేస్తే ఖచ్చితంగా విద్యార్థుల భవిష్యత్తు పైన దెబ్బ పడుతుందనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు.