
గత ఏడాది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. కూటమి లో పెద్దన్న పాత్ర పోషించిన జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే బిజెపి కూడా కూటమిలో ఉంది. అయితే కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఎక్కువగా నడుస్తుంది అన్న చర్చలు ఉన్నాయి. పేరుకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న . . పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రిగా ఉన్న లోకేష్ హవా ఎక్కువగా నడుస్తుందని లోకేష్ చెప్పినట్టు ప్రభుత్వంలో ఎక్కువగా జరుగుతుందన్న చర్చలు ఉండనే ఉన్నాయి. ఇది ఇలా ఉంటే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్న లోకేష్ ఎప్పటి నుంచే పార్టీలో తన మార్క్ లు చూపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్న మాజీమంత్రి యనమల రామకృష్ణుడు తాజాగా మరోసారి తనకు ఎమ్మెల్సీ సీటు ఇస్తారని ఆశించారు.
అయితే యనమలకు మరోసారి ఎమ్మెల్సీ ఇవ్వలేదు. ఇప్పటికే యనమల కుమార్తె దివ్య తుని ఎమ్మెల్యేగా ఉన్నారు .. యనమల అల్లుడు పుట్టా మహేష్ యాదవ్ ఏలూరు ఎంపీగా ఉన్నారు. వియ్యంకుడు సుధాకర్ యాదవ్ కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. అన్ని పదవులు ఒకే కుటుంబానికి ఇస్తే ఎలా అన్న ? విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. యనమల లాంటి సీనియర్ను ఇక పక్కన పెట్టకపోతే యువకులకు అవకాశాలు రావని లోకేష్ తెగించి యనమలను పక్కన పెట్టించారని .. ఇక ఆయన రాజకీయాలకు విశ్రాంతి తీసుకోవలసిన సమయం ఆసన్నమైందన్న చర్చలు తెలుగుదేశం పార్టీ వర్గాలలో వినిపిస్తున్నాయి. అదే చంద్రబాబు అయితే యనమలను పక్కన పెట్టే సాహసం చేయరు అని లోకేష్ మార్క్ రాజకీయం ఈ విషయంలో స్పష్టంగా కనిపిస్తోంది అని ... యువకులను ప్రోత్సహించే ఉద్దేశంతో లోకేష్ యానమలను పక్కన పెట్టేసారని అంటున్నారు.