
టిడిపి సీనియర్ నేత మాజీ మంత్రి పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ రాజకీయంగా ఎందుకో గాని అంత యాక్టివ్ గా ఉండటం లేదు. ఒకప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చక్రం చెప్పేవారు. ఇప్పుడు సీనియర్ నేతగా ఉన్న అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న ఎందుకో ఆయన అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు. ఆయన తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోం.ది వాస్తవానికి ఒకప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేత వైఎస్ఆర్ కాబినెట్లో మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ రాజకీయాలు మారిపోయాయి. కాంగ్రెస్ సీనియర్ నాయకులు తలోదారి ఎంచుకున్నారు. కన్నా బిజెపిలో చేరి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 2019 ఎన్నికల టైం లో ఆయన వైసీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. తెల్లవారితే వైసీపీ కండువా కప్పుకోవాల్సిన టైంలో ఢిల్లీ నుంచి బిజెపి పెద్దలు ఫోన్ రావడంతో కన్నా బిజెపిలోనే ఉన్నారు.
ఏపీ బీజేపీ అధ్యక్షుడు అయ్యారు .. ఇక ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి కాలం పూర్తయిన తర్వాత ఆయన మౌనంగా ఉన్నారు. మన ఎన్నికలకు కొద్ది రోజుల ముందు టిడిపి కండువా కప్పుకుని సత్తెనపల్లి సీటు దక్కించుకొని ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే తన సీనియార్టీకి తగినట్టుగా ఆయన మంత్రి పదవి ఆశించారు . . అది దక్కలేదు. అప్పటి నుంచే కన్నా అసంతృప్తి తో ఉన్నట్టు కన్నా అనుచరులు చెబుతున్నారు. మరోవైపు సత్తెనపల్లి టిడిపి రెండు వర్గాలుగా విడిపోయింది. ఇటు కన్నా ... అటు కోడెల వర్గాలు కొట్టుకుంటున్నాయి. ఇక తనకు పార్టీలోనూ ప్రభుత్వంలోనూ సరైన గుర్తింపు గౌరవం లేకపోవడంతో కన్నా పూర్తిగా సైలెంట్ గా ఉన్నారని అంటున్నారు. ఇటీవల ఆయన మీడియాకు కూడా దూరంగా ఉంటున్నారు.. అసెంబ్లీలోను అంత యాక్టివ్గాగా లేరు.