
కొద్దిరోజుల్లో రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మొత్తం ఐదు స్థానాలను కూటమి దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. నలుగురు ఎమ్మెల్యేల అవసరం ఉంది. మొత్తం 175 మందిలో 168 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేల మద్దతు లేకపోయినా కూడా ఐదు స్థానాలు కూటమి పార్టీలో బలపరిచిన వారికి దక్కుతాయి.. వారే విజయం సాధిస్తారు అనటంలో ఎలాంటి సందేహం లేదు. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించాలి అంటే ప్రస్తుతం కూటమికి ఉన్న 164 మంది ఎమ్మెల్యేలతో పాటు మరో నలుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. దీంతో వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలలో మరో నలుగురి కోసం కూటమి ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో మరో ప్రతిపక్షం లేదు.. ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు వైసీపీకి చెందిన వారే దీంతో ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేల వైపు కూటమి నాయకులు సీరియస్ గా దృష్టి పెట్టారు.
నలుగురు ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోగలిగితే ఐదు స్థానాలలో విజయం ఖాయం. అయితే ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టి కూటమి వేట ముమ్మరంగా సాగుతున్నట్టు తెలుస్తోంది. వైసీపీ తొలిసారి విజయం దక్కించుకున్న నియోజకవర్గాలపై కూటమి ప్రభుత్వం ఎక్కువగా దృష్టి పెట్టినట్టు సమాచారం. ఆయా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలతో చర్చలు జరుగుతున్న విషయం కూడా బయటకు వచ్చింది. గిరిజన సామాజిక వర్గానికి చెందిన ఒక ఎమ్మెల్యే ఎప్పటికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.
పార్టీ మారిపోయినా తన నియోజకవర్గంలో చెప్పిన పనులు చేస్తే తాను కూటమికి అనుకూలంగా ఓటు వేసేందుకు సిద్ధమైనట్టు టిడిపి వర్గాలలో ప్రచారం జరుగుతుంది. మరో ముగ్గురు విషయానికి వస్తే ఇందులో ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు ఉన్నారని అంటున్నారు. పేర్లు బయటికి చెప్పకపోయినా వీరిపై గతంలో అనేక కేసులు ఉన్నాయి. ఈ క్రమంలోనే వారు కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమికి సపోర్ట్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.