ఎమ్మెల్యే కొటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ‌కు సీటు వస్తుందని భావించిన ఇద్దరు తెలుగుదేశం నాయకులకు తీవ్ర నిరాశ మిగిలింది .. ఇక వారిలో ఒకరు పిఠాపురం వర్మ కాగా మరొకరు టిడిపి సీనియర్ నాయకుడు మాజీ మంత్రి దేవినేని ఉమా .. వీరిద్దరూ కూడా ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశించరు .. ఆశించారు అనడం కంటే పార్టీ అధిష్టానమే వారికి ఎమ్మెల్సీ హామీ ఇచ్చింది .. అయితే ఇక్కడ కారణాలు ఏమైనా తెలుగుదేశం అధిష్టానం వీరిద్దరిని పక్కన పెట్టేసింది .. ఇక ఇప్పుడు ఐదు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా వాటిలో ఒక స్థానాన్ని జనసేనకు కేటాయించటం పట్ల తెలుగుదేశం లో ఎవరికి ఎలాంటి అభ్యంతరం రాలేదు .. కానీ బీజేపీకి ఒక స్థానం ఇవ్వటం పట్ల క్యాడర్ లోనే కాకుండా పార్టీ నేతల్లో కూడా తీవ్ర అభ్యంతరాలు అనుమానాలు వస్తున్నాయి . బిజెపి కోసం ప్రతి విషయంలోనూ టిడిపి ఎందుకు త్యాగాలు చేయాలన్న ప్రశ్న కూడా గట్టిగా వినిపిస్తుంది .  గతంలో ఆర్ కృష్ణయ్య విషయంలోను ఇదే సిచువేషన్ వచ్చింది .. ఇప్పుడు ఎమ్మెల్సీల విషయంలోను బిజెపి పట్టుబట్టి మరి ఒక స్థానాన్ని తెలుగుదేశం నుంచి లాగేసుకున్నందున్న అభిప్రాయాలు క్యాడర్లో వస్తున్నాయి .. ఇదే క్రమంలో ఇటీవల విజయసాయిరెడ్డి తన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన ఖాతాని కూడా బిజెపి అభ్యర్థితోనే భర్తీ చేయాలని ఆ పార్టీ పట్టుబడుతున్నట్టుగా తెలుగుదేశం వర్గాల్లో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి .. ఈ విషయం పక్కనపడితే ..
 

ప్రస్తుతం ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని టిడిపి , బీజేపీ కోసం ఇవ్వటం కారణంగా పార్టీ ప్రతిపక్షంలో ఉండగా త్యాగాలు చేసి పోరాటాలు చేసిన నేతలకు ఎలాంటి అవకాశాలు లేకుండా పోతున్నాయి .. అలాంటివారిలో ప్రధానంగా పిఠాపురం వర్మ , దేవినేని ఉమా లాంటి నాయకులు ఉన్నారు .. గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన వర్మకు పార్టీ అధినేత ఎమ్మెల్సీ టికెట్ హామీ ఇచ్చినట్టు పార్టీ వర్గాలే చెబుతున్నాయి .. అదేవిధంగా పొత్తు ధర్మంలో భాగంగా తన సీటు త్యాగం చేసిన  ఉమాకు దాదాపు ఇలాంటి హామీయే వచ్చింది .  అయితే ఇప్పుడు ఆ ఇద్దరికి కూడా తెలుగుదేశం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదు .. ఇక దాంతో పిఠాపురం వర్మ తన అసంతృత్యుని బయట పెట్టారని అంటున్నారు .. తన సన్నిహితుల వద్ద పార్టీ కోసం త్యాగాలు చేసి తప్పు చేశామని త్యాగం చేసిన తనకు తగిన బుద్ధి జరిగిందని ఆయన వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు .. తర్వాత మీడియా సమావేశంలో పార్టీ నిర్ణయమే తన నిర్ణయాన్ని ఆయన ప్రకటించారనుకోండి అది వేరే విషయం .. ఇక దేవినేని ఉమ బహిరంగంగానే తన అసంతృతుని బయటపెట్టినప్పటికీ తనకు ఎమ్మెల్సీ అవకాశం రాకపోవటం వల్ల ఆయన నిరాశకు గురైనట్లు టిడిపి వర్గాలే చెబుతున్నాయి ..

 

అయితే నిజానికి బీజేపీలో ఎమ్మెల్సీ స్థానానికి తగిన నేత లేరని చెప్పాలి .. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి దగ్గరగా ఉన్న సోము వీర్రాజుకు ఇప్పుడు బిజెపి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం తెలుగుదేశం శ్రేణులలో తీవ్ర అసంతృప్తి అగ్రహానికి తెప్పిస్తున్నాయి .. నిజానికి బిజెపి తెలుగుదేశం జనసేన పార్టీలతో పొత్తు కారణంగా బిజెపి  ఎక్కువ లాభం పొందింది .. ఇదే పరిస్థితి ముందు ముందు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు సైతం చెబుతున్నారు .. వచ్చే ఐదేళ్ల కాలంలో ఖాళీ  అయ్యే ప్రతి పదవి తెలుగుదేశం కూటమికే రాబోతుంది .. అలాగే తెలుగుదేశం పార్టీపై ఒత్తిడి పెంచి బిజెపి కూడా తగుదునమ్మా అంటూ పదవుల కోసం పోటీకి వస్తుందని అంటున్నారు .. ఇలా మొత్తం మీద కష్టము టిడిపిది తాగాలు ఆ పార్టీవే అన్నట్లుగా పరిస్థితి మారిపోయిందిన్న ఆవేదన పార్టీ శ్రేణుల్లో గట్టిగా కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: