
ఇలాంటి నేపథ్యంలో.. నిజంగానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీ మారబోతున్నట్లు చర్చ జరిగింది. అయితే రాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తన రాజకీయ భవిష్యత్తుపై గత రెండు రోజులుగా కాంగ్రెస్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఈ చిల్లర వేషాలు మానుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. నేను రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానో.... ఏ వర్గాల ప్రజల కోసం వచ్చాను తనకు తెలుసు అన్నారు. పదవుల కోసం అస్సలు నేను రాలేదని వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రంలో తరతరాలుగా అణిచివేతకు గురైన వర్గాల విముక్తికి.... కెసిఆర్ స్థాపించిన గులాబీ పార్టీ సరైన వేదిక అని బలంగా నమ్మి ముందుకు వెళ్తున్నా అని ప్రకటించారు. రేపు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మరోసారి ముఖ్యమంత్రి అవుతారని... అప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో ఎలా ముందుకు వెళ్లాలో అనే దానిపైన ఇప్పటినుంచి ఆలోచన చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.