టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది దర్శకులు రోజురోజుకీ పరిచయం అవుతూనే ఉన్నారు. అందులో కొంతమంది దర్శకులు మాత్రమే వారి సినిమాలతో మంచి సక్సెస్ అందుకుంటారు. ఆలాంటి వారిలో దర్శకుడు అనిల్ రావిపూడి ఒకరు. ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎక్కడ చూసిన అనిల్ రావిపూడి పేరే వినిపిస్తోంది. ఇతను తన కెరీర్ లో తీసిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకోవడంతో స్టార్ దర్శకుడిగా పేరు సంపాదించుకున్నారు.


రీసెంట్ గా అనిల్ దర్శకత్వం వహించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ దర్శకుడికి ఎనలేని గుర్తింపు అందింది. ప్రస్తుతం అనిల్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే మరోవైపు తన తదుపరి సినిమా ప్రాజెక్టు గురించి ప్లాన్ చేస్తున్నారు. తన తదుపరి సినిమాను మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కథ దాదాపుగా పూర్తయిందట.


త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించే పనిలో అనిల్ ఉన్నట్లుగా సినీ ఇండస్ట్రీలో జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ను వెతికే పనిలో అనిల్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గురించి రోజుకో వార్త వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా ఇషా చావ్లాను పెట్టి సినిమా తీయాలని అనుకుంటున్నారట. ప్రేమ కావాలి సినిమాతో పరిచయమైన ఈ చిన్నది తన అందంతో పేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ సినిమాల పరంగా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.


చాలా కాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ చిన్నది ఇప్పుడు అనిల్ రావిపూడి - చిరంజీవి కాంబినేషన్లో రాబోయే సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో ఈషా చావ్లాతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లను కూడా ఎంపిక చేశారట. ఆ హీరోయిన్ల పేర్లు బయటికి రానప్పటికీ ఈ సినిమాలో మాత్రం ముగ్గురు హీరోయిన్లు ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ విషయం పైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: