
ఇక నామినేషన్ పాత్రల కోసం స్పెషల్ ఫ్లైట్స్ వాడిటం అనేది పార్టీ నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు .. ఇక చంద్రబాబు ను అమరావతిని తాను వ్యతిరేకించా ని అన్నటం అవాస్తమన్నారు .. మోడీ , చంద్రబాబు మధ్య ఎలాంటి బంధం ఉందో తనకు చంద్రబాబు తో కూడా అలాంటి అనుబంధమే ఉందన్నారు .. నామినేషన్లకు నిన్న చివరి రోజు కావడం తో వీర్రాజు నామినేషన్లు దాఖలు చేశారు .
అయితే 2014 - 19 వరకు ఎమ్మెల్సీగా ఉన్న సోము వీర్రాజు .. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి గా ఎన్నికయ్యారు .. ఆ తర్వాత దగ్గుబాటి పురందేశ్వరి ఆయన స్థానం లో అధ్యక్షురాలిగ హై కమాండ్ నియమించింది .. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఖాళీ కాబోతున్న 5 ఎమ్మెల్సీ స్థానాల్లో టిడిపి నుంచి ముగ్గురి కి జనసేన నుంచి ఒకరికి బిజెపి నుంచి ఒకరికి అవకాశాలు వచ్చాయి . జనసేన నుంచి నాగబాబును అభ్యర్థి గా ప్రకటించగా .. టిడిపి తరఫునకావలి గ్రీష్మ (ఎస్టీ) , బీద రవి చంద్ర(బీసీ) , బీటీ నాయుడు ( బీసీ ) పేర్లను ఆదివారం చంద్రబాబు ప్రకటించారు .