- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . . .

వైసిపి నాయకుడు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కి మరో బిగ్ షాక్ తగిలింది .. ప్రస్తుతం ఆయన రిమాండ్ ను మరో 14 రోజుల పాటు పొడిగించింది విజయవాడ ఎస్సీ , ఎస్టీ కోర్ట్ . దీంతో మార్చ్ 25 వరకు ఆయన పోలీస్ రిమాండ్ లోనే ఉండనున్నారు .. వల్లభనేని వంశీ రిమాండ్ ఈరోజు తో ముగియడం తో జైలు అధికారులు ఆయనను వర్చువల్ గా జడ్జి ముందు ఈరోజు ప్రవేశపెట్టారు .. ఈ సందర్భం గా న్యాయమూర్తి 2025 మార్చ్ 25 వరకు వంశీ రిమాండ్ ను పొడిగిస్తున్నట్టు నిర్ణయం తీసుకున్నారు .. సత్య వర్ధన్ కిడ్నాప్ , బెదిరింపులు కేసు లో వంశీ ని హైదరాబాద్ లో పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడ కు తరలించిన విషయం తెలిసిందే .

 

ఇవే కాకుండా  ప‌లు  భూములు కబ్జా చేశారంటూ వంశీ పై మరో కేసు కూడా నమోదు చేశారు .. మల్లపల్లి పారిశ్రామికవాడ లో 128 మంది రైతుల కు పరిహారం చెల్లించకుండా మోసం చేశార ని ఆయన పై కేసు నమోదు అయింది .. మొత్తం ఇప్ప‌టి వ‌ర‌కు వంశీ పై ఆరు కు  పైగా కేసు లు నమోదయ్యాయి .. మరో పక్క  వంశీ కస్టడీ పిటిషన్ ను  కోర్టు తిరస్కరిస్తూ ఆదేశాలు కూడా ఇచ్చింది .. వంశీ ని మరోసారి విచారణ చేసేందు కు కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేయక దాన్ని విజయవాడ ఎస్సీ , ఎస్టీ కోర్టు విచారణ చేపట్టింది .. ఈ క్రమం లోనే కస్టడీ పిటిషన్ డిస్మిస్ చేస్తూ నిర్ణయం తీసుకుంది .. తర్వాతి విచారణ ఈనెల 12 కు వాయిదా వేస్తున్నట్లు నాయిస్థానం ప్రకటించింది .

మరింత సమాచారం తెలుసుకోండి: