వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి రోజా కు బిగ్ షాప్ తగిలింది .. వైసిపి హయాం లో గత ప్రభుత్వం లో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర పేరు తో భారీ ఎత్తున స్కాం అవినీతి జరిగిందని ఆరోపణలు రావడం తో కూటమి  ప్రభుత్వం ఏసీబీ విచారణ కు కీలక ఆదేశాలు ఇచ్చింది . ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర పేరు తో క్రీడల పోటీలు నిర్వహించింది .. ఈ వ్యవహారం లో భారీ అవినీతి జరిగిందని పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా బయటకు వచ్చాయి . ఈ క్రమంలోని త్వరలో రోజా అరెస్ట్ అవటం ఖాయంగా కూడా కనిపిస్తుంది .
 

అటు ఆడుదాం ఆంధ్ర పై  నిన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లో కూడా పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది .. కూటమి ప్రభుత్వం లో క్రీడా శాఖ మంత్రిగా ఉన్న రాంప్రసాద్ రెడ్డి అసెంబ్లీ లో మాట్లాడుతూ .. 47 రోజులు 120 కోట్లు మంచినీళ్ళల‌ ఖర్చు పెట్టారని సంచల కామెంట్లు చేశారు .. అలాగే దీనిపై మాట్లాడాలంటే తనకే సిగ్గుగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు .. ఇందులో నిధులు పక్క దారి పెట్టాయని కూటమి ఎమ్మెల్యేలు చర్చ సందర్భంగా గ‌త ప్రభుత్వం పై ఆరోపణలు చేశారు .

 

ఈ క్రమంలోనే ప్రభుత్వం ఈ వ్యవహారం పై ఏసీబీ విచారణకు ఆదేశాలు ఇచ్చింది .. దీంతో రోజాకు గట్టి షాక్ తగిలింది .. ఆడుదాం ఆంధ్ర విషయంలో భారి స్కాం జరిగిందని నిజాలు బయటికి వస్తే మాత్రం రోజాకు గట్టి షాక్ తప్పదు .. ఇప్పటికే వైసీపీకి సంబంధించిన ఒక్కొక్క కీలక నాయకులు అరెస్ట్ అవుతూ వస్తున్న క్రమంలో .. రోజా కూడా త్వరలోనే అరెస్టు అవుతుందని అనుమానాలు కూడా వస్తున్నాయి .. ఇక‌ కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారంలో రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి ..

మరింత సమాచారం తెలుసుకోండి: