
అయితే ఈ నేపథ్యంలోనే ఒక సీనియర్ నేత తిరిగి మళ్లీ వైసీపీ పార్టీలోకి రావడానికి మక్కువ చూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక ఆ నేత ఎవరో కాదు కాపు రామచంద్రారెడ్డి.. రాయలసీమ జిల్లాలో చాలా బలమైన నేతగా పేరు పొందిన ఈయన గత ఎన్నికలలో వైసిపి నుంచి బిజెపి పార్టీలోకి వెళ్లారు అయితే బిజెపిలోకి చేరినప్పటికీ తనకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని తెలుసుకోవడంతో తిరిగి మళ్లీ వైసీపీ పార్టీలోకి రావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. గతంలో అనంతపురం జిల్లా రాయదుర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నోసార్లు విజయాన్ని అందించిన కాపు రామచంద్రారెడ్డి 2019లో వైసీపీ నుంచి కూడా భారీ విజయాన్ని అందుకున్నారు. అయితే 2024 లో టికెట్ ఇవ్వకపోవడంతో పార్టీని వీడారట.
ప్రస్తుతం వైసీపీ తన అనుకూల రాజకీయ పరిస్థితులను సైతం నెరవేర్చుకొనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. మరి పార్టీకి మద్దతుగా న్యాయకత్వం వహించే నేతలు కూడా ప్రస్తుతం అవసరం ఉండడంతో అధిష్టానం కూడా కాపు రామచంద్రారెడ్డి తో మంచి సంబంధాలను కలిగి ఉండడంతో తిరిగి సొంత గూటికి చేరే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జగన్ జిల్లాల పర్యటన చేసే సమయంలో కాపు రామచంద్రారెడ్డి తిరిగి వైసీపీలోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.