
అలాగే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు విద్యావేత్తలను విసిలుగా నియమించాం. హయ్యర్ ఎడ్యుకేషన్ లో పెద్దఎత్తున సంస్కరణలు తెస్తున్నాం. న్యాయపరమైన చిక్కులను తొలగించి, ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టులు భర్తీచేస్తాం. యూనివర్సిటీల అడ్మినిస్ట్రేషన్ కు యూనిఫైడ్ యాక్ట్ తేవాలని నిర్ణయించాం. రాష్ట్రంలోని 3 యూనివర్సిటీల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లు ఏర్పాటుచేసి, డీప్ టెక్నాలజీలో విద్యార్థులకు శిక్షణ ఇస్తాం. అమరావతిలో లా యూనివర్సిటీ, స్పోర్ట్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగువర్సిటీల ఎక్కడ ఏర్పాటుచేయాలనే విషయమై కేబినెట్ లో చర్చించి నిర్ణయిస్తాం. మండల నుంచి రాష్ట్రస్థాయి వరకు పబ్లిక్ లైబ్రరీలతోపాటు సెంట్రల్ లైబ్రరీ కూడా ఏర్పాటుచేస్తాం. స్వయం, స్వయం ప్లస్ ద్వారా స్కిల్ డెవలప్ మెంట్ చేసి ఇండస్ట్రీ కనెక్ట్ విధానాలను అమలుచేస్తాం. ప్రాంతాల వారీగా ఫోకస్ పాయింట్లను నిర్ణయించి ఆయా జిల్లాల్లో వచ్చే పరిశ్రమల అవసరాల మేరకు విద్యార్థులకు కావాల్సిన ట్రైనింగ్ ఇస్తాం. ఇప్పటికే సుజలాన్ తో ఒప్పందం కుదుర్చుకున్నాం. పిల్లలు కాలేజిలనుంచి బయటకు వచ్చేసరికి ఉద్యోగం రావాలన్నదే మా లక్ష్యం అని తెలిపారు.