
ఇంకా లోకేష్ మాట్లాడుతూ స్కిల్ డెవలప్ మెంట్ కు సంబంధించి మన రాష్ట్రంలో పెద్దఎత్తున పాలిటెక్నిక్, ఐటిఐ కళాశాలలు ఉన్నాయి. వాటిని బలోపేతం చేస్తాం. ప్రభుత్వ పాలిటెక్నిక్ లో అడ్మిషన్లు 69శాతానికి అడ్మిషన్లు పడిపోయాయి. ఐటిఐ, పాలిటెక్నిక్ లను ఎన్ సిక్విఎఫ్ అలైన్ మెంట్ లేక విద్యార్థులు తగ్గారు. దాంతోపాటు ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయిలు పెట్టివెళ్లడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. స్కిల్ డెవలప్ మెంట్ కు సంబంధించి క్లస్టర్ మోడల్ చేయాలన్నది ప్రభుత్వం ఆలోచన. లీప్ మోడల్ (లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్) గైడ్ బుక్ తయారవుతోంది. ప్రభుత్వ పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, యూనివర్సిటీ విద్య, ఐటిఐ, పాలిటెక్నిక్ లు... విద్యార్థులు, తల్లిదండ్రులకు ఫస్ట్ ఆప్షన్ గా ఉండాలనే లక్ష్యంతో లీప్ మోడల్ తెస్తున్నాం. రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలు, విద్యాసంస్థల్లో సీట్లకోసం రికమెండేషన్ లెటర్స్ కావాలని వచ్చే పరిస్థితి తీసుకొస్తాం, వాల్యూబేస్ట్ గ్లోబల్లీ రిలవెంట్ ఎకోసిస్టమ్ ఏర్పాటుచేస్తాం అని తెలిపారు.