టాలీవుడ్‌ నటుడు, వైసీపీ పార్టీ మద్దతు దారులు పోసాని కృష్ణ మురళికి ఊహించని షాక్‌ తగిలింది. జైలు నుంచి వైసీపీ పార్టీ మద్దతు దారులు పోసాని కృష్ణ మురళి విడుదల వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడంటూ వైసీపీ పార్టీ మద్దతు దారులు పోసాని కృష్ణ మురళిపై ఐదు నెలల క్రితం కేసు నమోదు చేశారు గుంటూరు సీఐడీ అధికారులు. అన్ని కేసుల్లో బెయిల్ రావడంతో ఈ రోజు పోసానిని విడుదల చేసే అవకాశం ఉందని నిన్నటి నుంచే ప్రచారం జరిగింది.

ఈ తరుణంలోనే...జైలు నుంచి పోసాని కృష్ణ మురళి విడుదల వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.  తాజగా సీఐడీ అధికారులు గుంటూరు కోర్టులో పోసానిపై పీటీ వారెంట్ దాఖలు చేయడం జరిగింది. ఇక ఏపీ సీఐడీ అధికారులు ఇచ్చిన పీటీ వారెంట్‌ను అనుమతించింది కోర్టు. దీంతో దీనిపై ఇవాళ విచారణ జరుగనుంది. కర్నూలు జైలు నుంచే ఆన్ లైన్ లో జడ్జి ఎదుట టాలీవుడ్‌ నటుడు, వైసీపీ పార్టీ మద్దతు దారులు పోసాని కృష్ణ మురళిని హజరుపర్చనున్నారు ఏపీ సిఐడి అధికారులు.

ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. అయితే.. ఈ కోర్టు విచారణ నేపథ్యంలో...  పోసాని కృష్ణ మురళి విడుదల వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. అయితే.. దీనిపై వైసీపీ పార్టీ నేతలు,  పోసాని కృష్ణ మురళి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే... పోసాని కృష్ణ మురళి ఇలా చేస్తున్నారని మండిపడుతున్నారు.


కాగా,  ఆదోని, విజయవాడ కోర్టుల్లో టాలీవుడ్‌ నటుడు, వైసీపీ పార్టీ మద్దతు దారులు పోసాని కృష్ణ మురళికి నిన్న బెయిల్ మంజూరు అయింది. ఇప్పటికే రాజంపేట, నరసరావుపేట కోర్టుల్లో పోసానికి బెయిల్ మంజూరు కావడం జరిగింది.  మిగతా కేసుల్లో BNS చట్టం 353 సెక్షన్ కింద నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు కూడా ఇచ్చింది. ప్రస్తుతం కర్నూలు జైల్లో ఉన్నారు పోసాని కృష్ణమురళి. అన్ని కేసుల్లో రిలీఫ్ రావటంతో ఇవాళ విడుదల అవుతారనే సమయానికి సీఐడీ అధికారులు ట్విస్ట్‌ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: