- ( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ ) . . .

వైసీపీ ఖాతాలో ఎమ్మెల్సీ పదవి వచ్చి పడింది. ఈ టైటిల్ ఏంట‌ని ? ఆశ్చర్యపోతున్నారా ? తాజాగా ఏపీలో ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఐదు కూటమికి ద‌క్కాయి. ఐదింటిలో మూడు టీడీపీ ... అలాగే జనసేన , బిజెపి పంచుకున్నాయి. సాంకేతికంగా చూస్తే 5 ఎమ్మెల్సీ పదవులు కూటమివే. టిడిపి నుంచి ముగ్గురు ... జనసేన నుంచి నాగబాబు .. బిజెపి నుంచి సోము వీర్రాజు అభ్యర్థులుగా ఉన్నారు. అయితే బిజెపి నుంచి నామినేషన్ దాఖలు చేసిన సోమ వీర్రాజును మాత్రం కూటమే అభ్యర్థిగా టిడిపి అలాగే ఆ పార్టీ అనుబంధం మీడియా అసలు గుర్తించడం లేదు. వైఎస్ జగన్ కు సన్నిహిత నాయకుడిగా వీర్రాజుపై టిడిపి సోషల్ మీడియా ఆక్టివ్ వ్యక్తులు ... అలాగే ఆ పార్టీ అనుకూల మీడియా ప్రతినిధులు ఎప్పటికప్పుడు బల్లగుద్ది మరీ చెబుతూ ఉంటారు. టిడిపిని తీవ్రంగా వ్యతిరేకించే సోము వీర్రాజుకు బిజెపి జాతీయ నాయకత్వం ఎమ్మెల్సీ పదవీ కట్టడం తెలుగుదేశం - జనసేన నాయకులకు .. తెలుగు దేశాన్ని ... జనసేనని ఎప్పుడు మోస్తూ ఉండేది మీడియా , ఛానల్స్ కు అస్సలు నచ్చటం లేదు.


ఆ మాటకు వస్తే బిజెపిలో ఉన్న చాలామంది తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసం పనిచేస్తారని విమర్శలు ఎదుర్కొన్న వారి వెంకయ్య నాయుడు నుంచి ప్రస్తుతం ఆ పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి ఇలా చాలామందిపై ఈ తరహా విమర్శలు ఉన్నాయి. ఆ కోణంలో చూస్తే సోము వీర్రాజు నికార్స్ అయినా బిజెపి నాయకుడు ... . ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేస్తూ ఆ తర్వాత బిజెపి నాయకుడిగా సోము వీర్రాజు ఎదిగారు. రాజకీయంగా టిడిపిని ... చంద్రబాబును సోము విమ‌ర్శించిన సందర్భాలు అనేకం. అందుకే వీర్రాజు అంటే వాళ్ళందరికీ బయటకి చెప్పుకోలేని కోపం. అయితే జాతీయ నాయకత్వం దగ్గర వీర్రాజుకు పలుకుబడి ఉండడంతో ఆయన ఎమ్మెల్సీ సీటు దక్కించుకున్నారు. అయితే చంద్రబాబు మాత్రం లంకా దినకర్ .. నాగభూషణం లాంటి తమ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళలో ఎవరో ఒకరికి సీటు ఇప్పించుకునే ప్రయత్నం చేసినా కానీ బిజెపి జాతీయ నాయకత్వం మాత్రం సోము వీర్రాజు పై మొగ్గుచూపడంతో చంద్రబాబు సైతం చేసేదేమీ లేకుండా పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: