ఏపీలో రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీది మాత్రమే హవా కొనసాగుతుంది. రాష్ట్రంలో ప్రస్తుతం కూటమి సర్కార్ అధికారంలో ఉండగా కూటమి సర్కార్ పాలనపై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉన్నా సంక్షేమంతో పాటు అభివృద్ధికి పెద్దపీట వేయడం ద్వారా కూటమి సర్కార్ ప్రశంసలు అందుకుంటోంది. అయితే కూటమి ఎంతోమంది ఎమ్మెల్సీ విషయంలో అన్యాయం చేశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
కూటమిని నమ్ముకుని ఎన్నికలకు ముందు ఎన్నో త్యాగాలు చేసిన వాళ్లకు కూటమి సర్కార్ తీవ్రంగా అన్యాయం చేసిందని వైసీపీ వాదన అనే సంగతి తెలిసిందే. అయితే ఎమ్మెల్సీ టికెట్ దక్కకపోయినా కూటమి సర్కార్ కు వ్యతిరేకంగా శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు ఒక్క నేత కూడా మాట్లాడలేదనే సంగతి తెలిసిందే. లోపల సమస్యలు ఉన్నా పైకి మాత్రం ఆవేదన వ్యక్తం చేయలేదు.
 
వైసీపీలో మాత్రం నేతలు తమకు పదవులు దక్కని సమయంలో బహిరంగంగా తమ ఆవేదనను వ్యక్తపరిచారు. కూటమి నేతల్లో ఉన్న క్రమశిక్షణ వైసీపీ నేతల్లో లేకపోవడమే ఆ పార్టీకి శాపంగా మారిందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. జగన్ ప్రధానంగా ఈ దిశగా దృష్టి పెట్టి అడుగులు వేయాల్సి ఉంది. తనకు ఇబ్బందులు రాకుండా జగన్ ఆచితూచి వ్యవహరించాల్సి ఉంది.
 
ఈ పరిస్థితి మారితే మాత్రం రాజకీయాల్లో జగన్ కు తిరుగుండదని మరిన్ని సంచలనాలు కొనసాగడం పక్కా అని చెప్పవచ్చు. అయితే రాష్ట్రంలో ఎన్నికలు జరగడానికి చాలా సమయం ఉన్న నేపథ్యంలో రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలు నమోదవుతాయో చూడాల్సి ఉంది. ఏపీ రాజకీయాలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతుండగా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. కూటమి సర్కార్ 2029లో కూడా అధికారంలోకి రావడానికి షాకింగ్ ప్రణాళికలను సిద్ధం చేసుకుందని సమాచారం అందుతోంది. ఈ ప్రణాళికల వల్ల ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి:

tdp