ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే అప్పుల ఊబిలో ఉందనే విధంగా చాలామంది నేతలు మాట్లాడుతూ ఉన్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్ కి ఏదైనా చేయాలి అంటే అప్పులు పుట్టడం లేదనే విధంగా వార్తలు వినిపిస్తూ ఉంటాయి. కానీ అప్పులు ఎక్కువ తీసుకున్నారని ఆనందించాలా.. లేకపోతే అప్పులు పుడుతున్నాయని అప్పుల పాలవుతున్నారనీ బాధపడలో తెలియడం లేదు ఏపీ ప్రజలకు.. దేశంలో అత్యధికంగా మహిళలు అప్పులు తీసుకున్న రెండవ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నది.. ఇది ఆంధ్రప్రదేశ్లోని విచిత్రమైనటువంటి వ్యవహారం.


అయితే ఈ తీసుకున్నటువంటి అప్పులలో వ్యక్తిగత రుణాలు అంటే.. పర్సనల్ లో 49 శాతం.. 2024 మహిళలు సెమీ అర్బన్ గ్రామీణ ప్రాంతాలు రుణాల సంఖ్య శాతం ఇలా ఉన్నాయి..బంగారం మీద అప్పులు 70 శాతం వరకు ఉన్నాయట. వ్యాపారం మీద తీసుకున్న అప్పులు 65% వరకు ఉన్నాయట.. వ్యవసాయ రుణాలు 84 శాతం.. అలాగే 2024లో దేశంలో 30 ఏళ్లలోపు యువ మహిళలు రుణాలు తీసుకున్న లెక్క ప్రకారం చూసుకుంటే.. వ్యక్తిగతంగా 42% వరకు , బంగారం రుణాలు మీద 17% వరకు.. వ్యాపార రుణాలకు 18 శాతం వరకు, వ్యవసాయ రుణాల మీద 13 శాతం వరకు తీసుకున్నారట.


అయితే ఇందులో మహిళ రుణగ్రహితంలో 41% వాటాతో దేశవ్యాప్తంగా మహిళలు రెండవ స్థానంలో రుణాలను పొందారు అనే విధంగా గొప్పగా చెబుతున్నాయి వార్తాపత్రికలు.. అయితే వ్యాపారపరంగా తీసుకున్నట్లు అయితే ఒక అర్థం ఉంది. వారు వ్యాపారం పెట్టుకుంటున్నారు కాబట్టి.. అయితే ఇక్కడ 20 దేశాలలో 30 ఏళ్లలోపు ఉన్న యువ మహిళలు రుణాలలో కేవలం వ్యాపార రుణాల శాతం 18% ఉందని.. ఇక వ్యవసాయం మీద కూడా పెద్దగా పెట్టలేదు.. కేవలం 13 శాతం మాత్రమే ఉన్నది.. బంగారు తాకట్టు పెట్టి ఇంటి ఖర్చులకోసం ఉపయోగించినవారు 17 శాతం మంది.. వ్యక్తిగత రుణాలు 42 శాతం వరకు ఉన్నది.. అప్పు దొరుకుతోంది కాబట్టి అప్పు చేస్తున్నారనే విధంగా వినిపిస్తున్నాయి.. ఈ అప్పులు కట్టడానికి ఇబ్బందులు తప్పడం లేదు అలాగే భర్తల మీద తిప్పలు పడడం వాటివి జరుగుతోంది.. అయితే అప్పుడు తీసుకోవడంలో గొప్పగా చెప్పుకోనే పరిస్థితిలలో మనం ఉన్నాము.

మరింత సమాచారం తెలుసుకోండి: