
తమన నాయకత్వంలో తిరుమల దర్శనం కోసం సిఫార్సుల లేఖల వ్యవస్థను పునరుద్దించడానికి తీసుకున్నటువంటి నిర్ణయానికి కృతజ్ఞతలు అంటూ ప్రజా ప్రతినిధుల తరఫున నుండి మంత్రి కొండా సురేఖ వెల్లడించింది. అలాగే ఇటీవల కాలంలో భక్తుల సంఖ్య కూడా పెరిగిందని.. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తెలుగు ప్రజల భక్తి ఎక్కడ తగ్గలేదు.. రెండు రాష్ట్రాలలో వెంకటేశ్వర స్వామిని సమానంగానే పూజిస్తున్నారని వెల్లడించింది.
Vip దర్శనం కోసం వారానికి రెండు సిఫార్సు లేఖలు ఉంటాయట.(500 టికెట్)
స్పెషల్ ఎంట్రీ దర్శనం వారానికి రెండుసార్లు (300 టికెట్)
సిఫార్సు లేఖలతో సోమవారం, గురువారం మధ్య ఏవైనా రెండు రోజులపాటు చెల్లుతాయట. ఈ మార్గదర్శకల ప్రకారం తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ కు అనుమతి ఉన్నది.
కానీ ఈ విషయం పైన అటు టీటీడీ అధికారులు ఈ సూచనలను పాటించకపోవడం వల్ల అటు భక్తులకు, ఇటు ప్రజాప్రతినిధులకు సైతం అసౌకర్యం కల్పిస్తున్నారు అంటూ మంత్రి కొండా సురేఖ ఆవేదన తెలియజేస్తూ ఉన్నది. తెలంగాణ నుంచి వస్తున్న భక్తులకు తిరుమలలో సజావుగా గౌరవమైన దర్శనం కలిగించేలా చేయాలని టిటిడి అధికారులు ఆమోదించినటువంటి విధానాన్ని పాటిస్తూ చూడాలంటూ ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాసింది.